తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు కొత్త ఓటర్ల లిస్టును సిద్ధం చేయాలంటూ పంచాయతీ శాఖ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీలు, వార్డుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం అవగా పంచాయతీలో వార్డుల సంఖ్య పెంచాలనే డిమాండ్ తో కొత్త ఓటర్ లిస్ట్ రూపకల్పనపై సమాచారం అందుతుంది. ఇదిలా ఉండగా… తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రమాద ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.