రష్మికపై కుక్క బిస్కెట్లు బాగానే పని చేస్తున్నాయ్!

-

కన్నడ సుందరి రష్మిక మందాన్న తెలుగు నాట ఎంతటి క్రేజ్‌ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శాండల్ బ్యూటీ.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆపై గీతగోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ డూపర్ హిట్స్‌ను సొంతం చేసుకుంది. తాజాగా భీష్మ అంటూ మరో సారి అందర్నీ ఆకట్టుకుంది.

అయితే భీష్మ ప్రమోషన్ టైమ్‌లో నితిన్ చెప్పిన ఓ సీక్రెట్ రష్మిక ఫేట్‌ను మార్చేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్ మాట్లాడుతూ.. రష్మిక కుక్క బిస్కెట్లు తింటుందని బయట పెట్టేశాడు. ఇక అది ఎంతగా వైరల్ అయిందంటే.. భీష్మ ప్రమోషన్స్ పక్కకు జరిగి.. రష్మిక బిస్కెట్ల ప్రమోషన్స్ అనే స్థాయివరకు వెళ్లింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద సైతం ఇవే జోకులు, ఏ ఇంటర్వ్యూలో చూసిన వీటికి సంబంధించిన కౌంటర్లే రష్మికకు పడ్డాయి.

ఇంతలా ఆ విషయం వైరల్ అవుతుందని తనకు తెలీదని, తెలిస్తే అప్పుడే నితిన్‌కు వార్నింగ్ ఇచ్చేదాన్ని అంటూ రష్మిక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అయితే తాను కేవలం టేస్ట్ మాత్రమే చూశానని, అది తినే సమయంలో నితిన్ చూశాడని పేర్కొంది. ఇక రష్మిక కుక్క బిస్కెట్ల వ్యవహారంపై ఎన్ని రకాలు మీమ్స్, ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె చేసే ఫోటో‌షూట్స్‌లోనూ అలాంటి పోజులే పెట్టడంతో అవి మరింతగా వైరల్ అవుతున్నాయి. తాజాాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో చూస్తే అచ్చం కుక్క పిల్ల మాదిరిగానే ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ లెక్కన కుక్క బిస్కెట్లు బాగానే పని చేస్తున్నాయ్ అని సెటైర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news