యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ లోని మంచి రేవులలోని గ్రే హౌండ్స్ క్యాంపస్ సమీపంలోని ఈ స్కూల్ లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కూల్ వెబ్ సైట్ ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పేద, ధనిక తేడా లేేకుండా ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా స్కూల్స్ దోహదపడుతాయని పేర్కొన్నారు. ఈ స్కూల్స్ నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో 20-25 ఎకరాల్లో సాగుతుండగా.. 12వ తరగతి వరకు ఉచిత విద్యా బోధన అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.