గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రష్మిక.. సర్జరీ వికటించిందా..?

-

నేషనల్ స్టార్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిన స్టార్ హీరోయిన్లలో ప్రస్తుతం ఈమె కూడా ఒకరు. పుష్ప సినిమాతో రష్మికకు ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈమెకు వరుసగా అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక ఇటీవల బాలీవుడ్ హంగామా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనింది. దక్షిణాదికి చెందిన హీరోయిన్ ప్రతిభావంతులైన నటి బాలీవుడ్ తారలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే అక్కడ రష్మిక లుక్ మాత్రం అందరిని ఆకర్షించింది. పూర్తిగా డిఫరెంట్గా కనిపించిన రష్మికను చూసి అందరూ షాక్ అయ్యారు కూడా.. ఈమె డిఫరెంట్ లుక్ పై జోరుగా చర్చించుకుంటున్నారు.. అయితే ఎప్పటిలాగే ఫుల్ స్మైల్ తో కెమెరాకు ఫోజులిచ్చిన ఈమె లుక్ లో ఏదో మార్పు వచ్చిందని.. ఆ నటి ఏదో సర్జరీ చేయించుకుంది అనే వార్త నడుస్తోంది. వాస్తవానికి బాలీవుడ్ నటీమణులు సర్జరీ చేయించుకోవడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు తాజాగా రష్మిక కూడా సర్జరీ చేయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇది చూసిన కొంతమంది సర్జరీ వికటించిందా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

బ్లాక్ గౌన్లో కనిపించిన ఈమె సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకుంది. కానీ రష్మిక చిరునవ్వులో పెదవులు చాలా భిన్నంగా కనిపించాయి.చూసిన కొంతమంది రష్మిక మందన్న లావయ్యారు అని కామెంట్లు చేస్తే మరికొంతమంది మేకప్ ప్రభావం కావచ్చునని కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా ఈమె మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు అన్నిచోట్ల చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ పుష్ప 2తో అల్లు అర్జున్తో బిజీగా ఉంది దీంతో పాటు ఇప్పుడు నితిన్ తో మరో అవకాశాన్ని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version