వారికీ ఆర్డర్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది : మంత్రి సీతక్క

-

నిజామాబాద్ మహిళా ప్రాంగణంలో నాణ్యమైన పసుపు, వరంగల్ మండలంలో నాణ్యమైన కారం ఉత్పత్తి అవుతుంది. మహిళా ప్రాంగణాల్లో ఉత్పత్తి అయ్యే పసుపు, కారం, ఇతర వస్తువులను అంగన్వాడి కేంద్రాలకు, హాస్టళ్లకు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం అని మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తెలంగాణ మహిళా సహకార డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తువులను ప్రభుత్వ హాస్టల్లు, ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. మహిళా ఉత్పత్తులకు వర్క్ ఆర్డర్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. జిల్లా కేంద్రాల్లో మహిళా సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం.

మాది మహిళా పక్షపాత ప్రభుత్వం. మహిళా ప్రాంగణాలకు నిధుల కొరత లేకుండా చూస్తాం. Serp, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ సిబ్బంది శిక్షణ కార్యక్రమాల కోసం మహిళా ప్రాంగణా లను వినియోగిస్తాం. తద్వారా మహిళా ప్రాంగణాలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దుతాం. త్వరలో మహిళా ప్రాంగణాలను సందర్శించి మహిళా కార్పొరేషన్ కార్యకలాపాలను పరిశీలిస్తా. ఉమెన్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు మరింత క్రియాశలకంగా పని చేయాలి. ఒక్క ఏడాదిలో మార్పు చేసి చూపించాలి. మహిళలకు శిక్షణ, రక్షణ కు వేదికగా మహిళా ప్రాంగణాలు నిలవాలి. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే కేంద్రం గా తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ మారాలి అని సీతక్క సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version