Ravi Teja: మాస్ మహారాజా మస్తు బిజీ.. వరుస సినిమాలతో రవితేజ ‘ధమాకా’

-

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరో రవితేజ. సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగి మాస్ మహారాజాగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ రోల్స్ మాత్రమే కాదు సీరియస్ రోల్స్ కూడా ప్లే చేసి హీరోగా చక్కటి పేరు సంపాదించుకున్నారు రవితేజ. ప్రజెంట్ వరుస సినిమాల్లో ఆయన మస్తు బిజీగా ఉన్నారు.

రవితేజ నటించిన ‘ఖిలాడీ’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ఫిల్మ్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ చిత్ర ఎఫెక్ట్ రవితేజ మీద పడకపోవడం విశేషం. అయితే, ఈ మూవీలో రవితేజ యాక్టింగ్ కు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈ ఏడాది జూన్ 17న విడుదల కానుంది.

‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫిల్మ్ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండగా, ఈ పిక్చర్ డెఫినెట్ గా హిట్ అవుతుందని సినీ అభిమానులు అంటున్నారు. కాగా, రవితేజ మాత్రం తన నెక్స్ట్ మూవీస్ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న ‘రావణాసుర’ ఫిల్మ్ చేస్తున్న మాస్ మహారాజ.. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ధమాకా’ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు.

మరో వైపున రవితేజ తన తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’కు కూడా ప్రిపేర్ అవుతున్నారు. స్టూవర్టుపురం గజదొంగగా పాపులర్ అయిన టైగర్ నాగేశ్వరరావు రియల్ లైఫ్ స్టోరి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version