Regina Cassandra: ఆ విషయాలపై అందరికీ ఆసక్తి..రెజీనా కసాండ్ర బోల్డ్ కామెంట్స్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్ర..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ సుందరి..మెగాస్టార్ తో పర్ఫెక్ట్ సింక్ లో గ్రేస్ ఫుల్ స్టెప్స్ వేసే ప్రయత్నం చేసింది. ఈ భామ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది.

ఓ వైపు వెండితెరపైన సినిమాలు చేస్తూనే మరో వైపున డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది.
అలా బోల్డ్ రోల్స్ ప్లే చేయడానికి రెడీ అనే సంకేతాలు ఇచ్చేసింది. హిందీ ఓటీటీ సిరీస్ ‘‘రాకెట్రీ బాయ్స్’’లో నటించిన రెజీనా..రీజినల్ మూవీస్ పైన తాజా సోషల్ మీడియా చిట్ చాట్ లో తన అభిప్రాయాలు తెలిపింది.

రీజినల్ సినిమాలు పాన్ ఇండియా వైడ్ రన్ అవడానికి కారణం కంటెంట్ అని, అటువంటి కంటెంట్ ను అందరూ స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చింది. తాను సౌత్‌తో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా చేస్తున్నానని పేర్కొన్న రెజీనా..యాక్ట్రెస్‌గా తనకు డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేయడం ఇష్టమని చెప్పింది. కొత్త కంటెంట్‌ను, కథలను చూసేందుకు ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పింది రెజీనా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version