అఖిరా సినిమాల్లోకి రావడంపై రేణు దేశాయ్ సంచలన కామెంట్స్ చేశారు. అఖిరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా అన్న ఆత్రుత ఉందని తెలిపారు రేణు దేశాయ్. అఖిరా నందన్ సినిమాల్లోకి రావాలని నేనూ కోరుకుంటున్నానని సినీనటి రేణు దేశాయ్ అన్నారు. తల్లిగా అఖిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడని నాకూ ఆత్రుతగా ఉందన్నారు. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడన్నారు.
తూర్పుగోదావరిలో పర్యటించిన నటి రేణు దేశాయ్ ఈ సందర్భంగా మాట్లాడారు. గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ నేను ఎక్కడ చూడలేదని… విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదని వివరించారు. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు
ప్రకటించారని… ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషం అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉందని….సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశానని ప్రకటించారు.
అఖిరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా అన్న ఆత్రుత ఉంది: రేణు దేశాయ్ pic.twitter.com/3NUF2ZBI5U
— BIG TV Breaking News (@bigtvtelugu) January 5, 2025