పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య .. ప్రముఖ సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకునే ఈమె తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా తన కుమార్తె ఆధ్యా తో కలిసి కాశ్మీర్ కొండల్లో విహరించింది.
ఎప్పటికప్పుడు తన పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రేణు దేశాయ్ తన పిల్లలతో తరచూ వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన పోస్ట్ చేసింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా తమ హెల్త్ ఇష్యులను బయటపెడుతున్నారు. తాజాగా రేణు దేశాయ్ తన ఆరోగ్య సమస్య గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తను గుండె, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు, వాటిని ఎదుర్కొనేందుకు శక్తిని కూడబెట్టుకుంటున్నానని తెలిపారు. ఇలా ఎవరైనా బాధపడుతుంటే, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకుండా బలంగా నిలబడాలంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.