కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ రేణు దేశాయ్

-

పవన్ మాజి భార్య రేణు దేశాయ్ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమైందని తెలుస్తుంది. పవన్ తో విడిపోయిన తర్వాత పూణేలో ఉంటున్న రేణు దేశాయ్ ఈమధ్య మాట్ టివి డ్యాన్స్ షో ద్వారా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇక ఈమధ్యనే తన రెండో పెళ్లి గురించి కూడా రేణు దేశాయ్ హంగామా తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తైతే సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేస్తుందట.

సెకండ్ ఇన్నింగ్స్ అంటే కొంపదీసి మళ్లీ రేణు హీరోయిన్ గా చేస్తుంది అనుకుంటే పొరపడినట్టే. ఈసారి ఆమె డైరక్షన్ చేస్తుందని ప్రకటించింది. సినిమా కథ కూడా రైతుల సమస్యల మీద ఉంటుందట. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని.. ఈ సినిమాను డైరెక్ట్ చేయడమే కాదు నిర్మాతగా కూడా తాను వ్యవహరిస్తున్నట్టు తెలిపింది రేణు దేశాయ్.

తన తండ్రి రైతు కాబట్టి తనకి ఆ కష్టాలు తెలుసంటున్న రేణు దేశాయ్ అందరిని ఆలోచింప చేసేలా ఈ సినిమా ఉంటుందని చెబుతుంది. రేణు తీసుకున్న ఈ డైరక్షన్ స్టెప్ ఆమెకు ఎలాంటి క్రేజ్ తెచ్చి పెడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version