లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ కు సెన్సార్ బిగ్ షాక్.. కోర్ట్ లో తేల్చుకుంటానని ఫైర్..!

-

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాకు అనుకున్నట్టుగానే సెన్సార్ బోర్డ్ బ్రేక్ వేసింది. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈ సినిమా ఉంటుందని టిడిపి శ్రేణులు మండిపడుతున్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో రిలీజ్ పక్కా అనుకున్నారు కాని అనూహ్యంగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుండి షాక్ తగిలింది.

సినిమా సెన్సార్ ఎలక్షన్స్ తర్వాత చేస్తామని అప్పటివరకు సెన్సార్ వాయిదా వేస్తామని అన్నారట. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం వరకే సెన్సార్ బాధ్యత అంతేకాదు వాయిదా వేసే అధికారం లేదని అని ఫైర్ అవుతున్నాడు వర్మ. ఈ విషయంపై కేసు ఫైల్ చేస్తున్నానని తన ట్విట్టర్ ద్వారా వెళ్లడించాడు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అసలైతే మార్చి 22న రిలీజ్ కావాల్సి ఉంది. కాని సెన్సార్ షాక్ ఇవ్వడంతో రిలీజ్ పై మళ్లీ సందేహాలు ఏర్పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version