Bigg Boss 3: ఆ ఇద్ద‌రి రొమాన్సే ఆమెకు ఎస‌రు పెట్టిందా..!

-

బిగ్ బాస్ సీజన్ 3లో తొలి మూడు వారలు ప్రేక్షకులు ఊహించిన విధంగానే ఎలిమినేషన్స్ జరిగాయి. తొలి వారం హేమ హౌస్ నుంచి బయటకు వెళ్లగా రెండవ వారం జాఫర్, మూడవ వారం తమన్నా ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారం ఎలిమినేష‌న్‌కు ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతున్నార‌న్న ఉత్కంఠ ఉన్నా రోహిణి పేరే సోష‌ల్ మీడియాలో ఎక్కువుగా స‌ర్క్యులేట్ అవుతోంది.

Rohini Eliminated Bigg Boss 3 Telugu 4th Week Because That Love Story

రవికృష్ణ, రోహిణి, శివజ్యోతి, శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ నామినేషన్ లో ఉన్నారు. శనివారం రోజు వీరిలో శివజ్యోతి, వరుణ్ సేఫ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. దీనితో మిగిలినవారిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరనే దానిపై సోషల్ ఎండియాలో లీకులు వినిపిస్తున్నాయి.

సీరియల్ నటి రోహిణి ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రోహిణితో పాటు శివజ్యోతి, రాహుల్ లకు కూడా తక్కువ ఓట్లు వచ్చాయట. వీరిలో శివజ్యోతి సేఫ్ అయిపోయింది కాబట్టి ఇక మిగిలింది రోహిణి, రాహుల్. వీరిలో ముందు నుంచి రాహుల్ ఎలిమినేట్ అవుతార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

అయితే పున‌ర్న‌వితో రాహుల్ కంటిన్యూ చేస్తోన్న రొమాంటిక్ ట్రాక్ ఈ వారం రాహుల్‌ను సేఫ్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వాళ్లిద్ద‌రు హౌస్‌లో కంటిన్యూ చేస్తోన్న రొమాంటిక్ ట్రాక్‌తోనే రోహిణిపై ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేకున్నా ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు. ఒక‌వేళ ఈ వారం డబుల్ ఎలిమినేష‌న్ జ‌రిగితే మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండే అవ‌కాశం ఉందంటున్నారు. ఆదివారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version