బిగ్బాస్ సీజన్ 8 లో రాయల్స్ అని 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అయ్యారు. వీళ్ళందరూ ప్రేక్షకులకి కొత్త కాదు. ఇదివరకు సీజన్స్ లో కంటెస్టెంట్ గా కనపడిన వాళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే కొత్త కంటెస్టెంట్స్ అడుగుపెట్టగానే పాత వారిపై నామినేషన్స్ మొదలయ్యాయి. రాయల్స్ అంతా ఆడియన్స్ లాగా బయట నుంచి షో చూసి వచ్చామని చెప్తున్నా కూడా అర్థం చేసుకొని పాత కండిషన్స్ నామినేషన్స్ విషయంలో అప్పుడే పగ కూడా పెంచుకుంటున్నారు. హైలెట్ ఏంటంటే కొత్తగా వచ్చిన రాయల్స్ మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉంటుంది.
మెగా చీఫ్ అయిన కారణంగా నబీల్ ని నామినేట్ చేయడానికి వీలు లేదు. హరితేజ వచ్చి యష్మీ, పృథ్వీ లని నామినేట్ చేశారు. ఇలా నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. నామినేట్ చేస్తూ మణికంఠ తో తన ప్రవర్తన గురించి మాట్లాడింది. పృద్విని నామినేట్ చేసిన హరితేజ ఇతరులు చెప్పిన మాటను మాత్రమే వింటాడని సొంతంగా ఆడడం చూడలేదని చెప్పింది.
నయని పావని, విష్ణుప్రియ సీతను నామినేట్ చేసింది. విష్ణు ప్రియ గేమ్ ని సీరియస్ గా తీసుకోదని ఆరోపించింది. విష్ణు ప్రియ సీరియస్ గా రియాక్ట్ అయింది. సీత ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందని నామినేట్ చేస్తుంది. టేస్టీ తేజ మణికంఠని నామినేట్ చేశారు. ఎవరైనా మణికంఠను నామినేట్ చేస్తారేమోనని యష్మి చూసింది. తేజా నామినేట్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అయింది. పదేపదే సమస్యలను చెప్పడం వలన ప్రేక్షకులకి చిరాకు వస్తుందని అదే స్ట్రాటజీ అయితే మంచి గేమర్ అని తేజ ప్రశంసించాడు.