‘ఆర్ఆర్ఆర్’కు రాజమౌళి గత చిత్రాలను మించిన రెస్పాన్స్ .. అందుకు కారణమైన సన్నివేశాలు ఇవే..

-

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇప్పటి వరకు 12 సినిమాలు చేశారు. కాగా, ఆ చిత్రాలన్నిటినీ మించిన టాక్ ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌కు వచ్చింది. ఈ మూవీ వాటన్నిటితో పోలిస్తే నెక్ట్స్ లెవల్ అని అభిమానులు చెప్తున్నారు. ఏళ్ల నుంచి ఈ చిత్రం కోసం ఎదురుచూపులు ఉండగా, ఈ శుక్రవారంతో పులిస్టాప్ పడింది. దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ ఈ పిక్చర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రేక్షక లోకం ఈ సినిమా చూసి తరించిపోవడమే కాదు.. రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్తోంది. అయితే, రాజమౌళి గత చిత్రాలను మించిన చక్కటి పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి చిత్రంలోని సన్నివేశాలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు.

విజ్యువల్ వండర్‌గా చిత్రం ప్రతీ ఒక్కరిని ఆకట్టుకోవడమే కాదు. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తోంది. అందుకు గాను దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. హీరోలిద్దరి ఇంట్రడక్షన్ సీన్స్ ఫస్ట్ హైలైట్. కాగా, పరిచయ సన్నివేశాలలో హీరోల ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇంట్రడక్షన్ షాట్ లో ఆయన చూపిన హావ భావాలు ప్రతీ ఒక్కరికి చాలా బాగా నచ్చుతున్నాయి.

భారీ స్థాయిలో ఉన్న జనాల మధ్యలోకి ఒక్కడే వెళ్లి వీరోచితంగా పోరాడుతున్న సన్నివేశం మెగా అభిమానులనే కాదు.. సినీ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక గ్రాండియర్ స్కేల్ లో సినిమా ఉండటం చూస్తుంటే ప్రతీ ఒక్కరు అలా థియేటర్ లోనే ఉండిపోవాలనుకుంటారు. కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కూడా అంచనాలకు తగ్గట్లుగా ఉంటుంది. అడవిలో పులి మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ .. మరో పులితో ఫైట్ చేసే సీన్ చూస్తుంటే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.

ఇక సూపర్బ్ డ్యాన్సర్స్ అయిన స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ‘నాటు నాటు’ సాంగ్ కు వేయించిన స్టెప్స్ చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి మార్క్‌కు తగ్గట్లు ‘దోస్తీ’ సాంగ్ కూడా గ్రాండియర్ గా తీశారు. ఇక ఎమోషన్ క్యారీ చేయడంలో నటీనటులు చాలా జాగ్రత్త వహించారు. ‘కొమురం భీముడో’ పాటలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ మాత్రమే కాదు.. ఆ పాత్రను ఆయన తప్ప ఎవరూ పోషించలేరు అనేంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు తారక్. ఇన్నోసెంట్ ట్రైబర్ పర్సన్‌గా తారక్ ను చూస్తే ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు.

ఇక రాజమౌళి ప్రతీ సినిమాలో ఇంటర్వల్ బ్యాంగ్ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ పిక్చర్‌లో కూడా అదే రేంజ్ లో ఉండటం విశేషం. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ మధ్య ఉన్న ఎమోషనల్ సీన్ కూడా చాలా బాగా వచ్చింది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తుల దోస్తీ, లడాయి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తున్నది. ప్రధానంగా ఈ సన్నివేశాలు బాగుండటం వలనే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ సినిమా చూడాలని భావిస్తున్నారని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version