వామ్మో.. `ఆర్ ఆర్ ఆర్‌` క్లైమాక్స్‌కు అంత ఖ‌ర్చు అయిందా..?

-

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌ వస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. ఈ సినిమా కోసం మొత్తం 450 కోట్లను ఖర్చు చేయనున్నారు. అయితే ఒక్క క్లైమాక్స్ కోసమే 150 కోట్లను కేటాయించినట్టుగా సమాచారం. ఎన్టీఆర్ .. చరణ్ తదితరులపై భారీస్థాయిలో క్లైమాక్స్ ను డిజైన్ చేశారట.

ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. ఈ సినిమాలో క్లైమాక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుని ఒక రేంజ్ లో ఉంటుందట. అందువలన ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పై ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. చరణ్ జోడీగా అలియా భట్ .. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, జులై 30వ తేదీన విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version