ఆస్కార్​ బరిలో ఆర్​ఆర్​ఆర్​, శ్యామ్​సింగరాయ్​.. నిజమెంత? అసలు ఈ రూల్స్​ తెలుసా?

-

మోడ్రన్ సినిమాటిక్ వరల్డ్​లో అత్యున్నత స్థాయి గుర్తింపు ఏదీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘ఆస్కార్స్’. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలను గౌరవించేలా ఇచ్చే అకాడమీ అవార్డులనే ఆస్కార్స్ అంటారు.

ఈ పురస్కారాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతిఏడాది మార్చి, ఏప్రిల్, మే.. ఏదో ఒక నెలలో నిర్వహించే ఈ వేడుకల కోసం ఏడాది ముందు నుంచే సందడి ఉంటుంది. అఫీషియల్ సబ్మిషన్స్, ఎంట్రీలు, షార్ట్ లిస్ట్​లు, ఫైనల్ నామినేషన్లు.. ఇలా చాలా ప్రక్రియలు ఉంటాయి. అయితే 2022కు గానూ భారత్ నుంచి ఏ సినిమాను ఆస్కార్ ​కు అఫీషియల్ ఎంట్రీగా సబ్మిట్ చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

ఇప్పుడు నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూడు విభాగాల్లో ఆస్కార్స్​కి అఫిషియల్ సబ్మిషన్​గా వెళ్లిందని జోరుగా ప్రచారం సాగుతోంది. క్లాసికల్​ కల్చరల్ డ్యాన్స్​, పీరియాడిక్ ఫిల్మ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేటగిరిల్లో ఆస్కార్ నామినేషన్లకు శ్యామ్ సింగరాయ్ పోటీపడుతోందని కథనాలు వస్తున్నాయి. కానీ నిజంగా ఈ సినిమా అఫీషియల్ ఎంట్రీగా వెళ్లిందా లేదా అనేది క్లారిటీగా తెలీదు. దీనిపై మూవీటీమ్​ కూడా ఇంకా స్పందించలేదు.

ఆస్కార్స్ సబ్మిషన్ రూల్స్ ఏంటీ.. 2021లో విడుదలైన సినిమాలకు ఆస్కార్స్​ను 2022 మార్చిలో ప్రకటించారు. ఇప్పుడు 2022లో విడుదలైన సినిమాలకు ఆస్కార్స్​ను 2023లో ప్రకటిస్తారు. ఇవి 95వ అకాడమీ అవార్డ్స్​. 2023లో ప్రకటించే ఆస్కార్స్ కోసం అకాడమీ ఇప్పటికే కటాఫ్ డేట్​ను, అఫిషియల్ సబ్మిషన్ డేట్​ను ముందే ప్రకటించింది. జనవరి 1, 2022 నుంచి 30 నవంబరు 2022 లోపు విడుదలయ్యే సినిమాలు వచ్చే ఏడాది ప్రకటించే ఆస్కార్స్ నామినేషన్స్​లోకి వెళ్తాయి. అఫిషియల్ సబ్మిషన్స్ కోసం డెడ్​లైను అకాడమీ 3 అక్టోబర్, 2022 గా ప్రకటించింది. అంటే అక్టోబర్, నవంబర్​లో విడుదలయ్యే సినిమాలు కూడా ఎంట్రీకి పంపించుకోవచ్చు. ఫైనల్ నామినేషన్స్, అఫీషియల్ అనౌన్స్​మెంట్​ సమయానికి అవి స్క్రీనింగ్ అయిపోతాయి కాబట్టి వీటి పైన ఫిల్మ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా ఓ నిర్ణయం తీసుకుని పంపించే అధికారం ఉంటుంది.

ఆస్కార్స్​లో ఉండే కేటగిరీలు.. ప్రస్తుతం 23 కేటగిరీల్లో ప్రస్తుతానికి 23 కేటగిరీల్లో ఆస్కార్​ అవార్డులను ప్రకటిస్తున్నారు. యాక్టర్​ ఇన్​ ఏ లీడింగ్​ రోల్​, యాక్టర్​ ఇన్​ ఏ సపోర్టింగ్​ రోల్​, ఫీమేల్​ యాక్టర్​ ఇన్​ ఏ లీడింగ్​ రోల్​, ఫీమేల్​ యాక్టర్​ ఇన్​ ఏ సపోర్టింగ్​ రోల్​, సినిమాటోగ్రఫీ, కాస్టూమ్​ డిజైన్​, డైరెక్టింగ్​, ఫిల్మ్​ ఎడిటింగ్​, మేకప్​ అండ్​ హెయిర్​స్టైలింగ్​, మ్యూజిక్​(ఒరిజినల్​ స్కోర్​), మ్యూజిక్​(ఒరిజినల్​ సాంగ్​), బెస్ట్​ పిక్చర్​, ప్రొడక్షన్​ డిజైన్​, సౌండ్​, విజువల్ ఎఫెక్ట్స్​, రైటింగ్​(అడాప్టడ్​ స్క్రీన్​ప్లే), రైటింగ్​(ఒరిజినల్ స్క్రీన్​ప్లే), షార్ట్​ ఫిల్మ్​(లైవ్​ యాక్షన్​), షార్ట్​ఫిల్మ్​(యానిమేటెడ్​), డాక్యూమెంటరీ,(షార్ట్​ సబ్జెక్ట్​), డాక్యూమెంటరీ(ఫీచర్​), యానిమేటెడ్​ ఫీచర్​ ఫిల్మ్​తో పాటు ఇంటర్నేషనల్​ ఫిల్మ్​తో పాటు ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీలు ఉన్నాయి.

ఈ కేటగిరిలోకి భారత్​ సినిమాలు.. భారత్​లోనే చిత్రీకరించి, మొదటగా ఇక్కడే విడుదలయ్యే ఇండియన్​ సినిమాలు.. ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీలో మాత్రమే పోటీ పడే అవకాశం ఉంటుంది. కారణం అకాడమీ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. వాస్తవానికి అకాడమీ అవార్డ్స్ అమెరికన్ సినిమాల కోసం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత విదేశాల్లో విడుదలయ్యే సినిమాలకు కూడా గౌరవం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా విదేశీ చిత్రాలను నామినేషన్స్​లోకి అంగీకరిస్తున్నాయి. ఒకవేళ నామినేషన్స్​లో వేరే దేశాల చిత్రాలు కనిపిస్తున్నా..అవన్నీ కూడా అకాడమీ రూల్స్​ను మొదట యూఎస్​లోనే విడుదల చేయటం…ఇంగ్లీష్​లో సినిమాలో ఉండటం, సినిమాలో పని చేసే ప్రతీ సిబ్బంది పేరును స్క్రీన్ క్రెడిట్స్ లో ఉండటం లాంటి 125 రూల్స్​ను ఫాలో కావలసి ఉంటుంది. అవన్నీ చేయలేని దేశాలు తన సినిమాలను సింపుల్​గా ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీకి పంపిస్తాయి. మీకు అనుమానం రావచ్చు స్లమ్​డాగ్​ మిలీయనీర్​కు చాలా విభాగాల్లో ఆస్కార్స్ వచ్చాయి కదా అని. స్లమ్ డాగ్ ఇండియా కథతో, ఇండియాలో షూట్ చేసుకున్న బ్రిటీష్ డ్రామా ఫిల్మ్. పైన చెప్పిన యూఎస్​ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ తన ఎంట్రీని సబ్మిట్ చేసింది కాబట్టే ఆస్కార్స్ వచ్చాయి.

భారత్​కు ఎప్పడైనా అవార్డ్ వచ్చిందా..? 1957 నుంచి భారత్​కు ఆస్కార్స్​కు సినిమాలను అఫీషియల్​గా సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్​గా పిలుస్తున్న కేటగిరీనే ఈ మధ్య కాలం వరకూ బెస్ట్ ఫారెన్​ ల్యాంగ్వేజ్​ ఫిల్మ్​గా పిలిచే వారు. 1956 నుంచి ప్రారంభమైంది ఈ కేటగిరీ. ఇంచుమించుగా అప్పటి నుంచి భారత్ ఏటా ఓ సినిమాను అఫీషియల్ ఎంట్రీగా సబ్మిట్ చేస్తూనే ఉంది. 1957 లో ‘మదర్ ఇండియా’ సినిమా మన మొదటి అఫిషియల్ సబ్మిషన్ కాగా…ఆ ఏడాది ఆ సినిమా ఫైనల్ నామినేషన్స్ లోకి వెళ్లింది కూడా. ఆ తర్వాత 1988లో సలాం బాంబే, 2001 లో లగాన్ సినిమాలు నామినేషన్స్ లోకి వెళ్లాయి కానీ అవార్డు మాత్రం రాలేదు. చివరిగా అంటే గతేడాది 2021 కి గానూ నయనతార, విఘ్నేష్ శివన్ నిర్మించిన ‘ Pebbles’ అనే తమిళ్ సినిమాను ఆస్కార్ ఎంట్రీ కి అఫీషియల్​గా సబ్మిట్ చేశారు కానీ నామినేషన్స్​లో చోటు దక్కించుకోలేదు. ఇప్పటివరకూ 7సార్లు కమల్ హాసన్ సినిమాలు ఆస్కార్స్ సబ్మిషన్స్ కు అఫీషియల్స్​గా వెళ్లాయి. అందులో మన తెలుగు సినిమా స్వాతి ముత్యం కూడా ఉంది. ఆ తర్వాత 5 ఆమీర్ ఖాన్ సినిమాలు, 3 సత్య జిత్ రే సినిమాలు ఆస్కార్స్ సబ్మిషన్స్​కు వెళ్లాయి. కానీ ఎప్పుడూ ఏ భారతీయ సినిమాకు ఈ క్యాటగిరీలో అవార్డు దక్కలేదు. కనీసం నామినేషన్స్​లోకి ఓ భారతీయ చిత్రం వెళ్లి కూడా 21 ఏళ్లు గడిచిపోయాయి.

సినిమాలకు రాలేదు కానీ.. 1983లో గాంధీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్​గా పనిచేసిన భాను అథయా ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు. ఆ తర్వాత 2009లో స్లమ్ డాగ్ మిలినీయర్ సినిమాకు గానూ ఏఆర్ రెహమాన్ బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​, బెస్ట్​ ఒరిజనల్​ స్కోర్​ విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకుని ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. భారతీయులు రసూల్ పూకుట్టి, గుల్జార్​లు కూడా స్లమ్ డాగ్ సినిమాకు గానూ ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. వీటన్నింటిలోకి గొప్ప విషయం ఏంటంటే 1992 లో ఆస్కార్స్…ఇండియన్ లెజండరీ డైరెక్టర్ సత్యజిత్ రే కు హానరీ ఆస్కార్ ఫర్ లైఫ్ టైం అచీవ్​మెంట్​ అవార్డు ఇచ్చింది. ఇది కూడా అరుదుగా ఇచ్చే అవార్డే. ఇవి కాకుండా టెక్నికల్ అచీవ్​మెంట్స్​ విభాగాల్లో 2016, 2018లో భారతీయులకు అవార్డులు వచ్చాయి కానీ వాళ్లు ఇండో అమెరికన్స్.

శ్యామ్ సింగరాయ్ వార్త పుకార్లేనా..?.. శ్యామ్ సింగరాయ్ ఆస్కార్స్​కు నామినెట్ అయ్యిందని చెబుతున్న విభాగాలు అకాడమీ అవార్డుల జాబితాలో లేవు. ఆస్కార్స్​లో ఏదైనా కొత్త కేటగిరీ పెట్టాలన్నా, తీసేయాలన్నా చాలా పెద్ద తతంగం ఉంటుంది. అకాడమీ అవార్డులను నిర్వహించేందుకు ది బోర్డ్ ఆఫ్ గవర్నర్ పేరుతో ఓ కార్యనిర్వాహక బృందం ఉంటుంది. ఏటా ఓ సారి సమావేశమైన ఈ కేటగిరీలను చర్చిస్తారు. కొత్త ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే పెడుతుంటారు. వాటిపై ఓటింగ్ జరుగుతుంటుంది.

అలా బెస్ట్ క్యాస్టింగ్​: 1999లో ఈ కేటగిరీ తీసుకుద్దామనే ప్రపోజల్​ను దీన్ని రిజెక్ట్ చేశారు.

బెస్ట్​ పాపులర్​ ఫిల్మ్​ కేటగిరీలో ఓ అవార్డ్ ఇద్దామని 2018లో ప్రపోజల్ వచ్చింది. కానీ అది వాయిదా పడుతూ వస్తోంది. బహుశా అది వచ్చే సంవత్సరంలో దాని యాడ్​ చేయొచ్చు.

బెస్ట్ స్టంట్​ కోఆర్డినేషన్​: 1991 to 2012 వరకూ ఏటా ఈ ప్రపోజల్ వచ్చింది. కానీ ఇది కూడా రిజెక్ట్ అవుతూనే ఉంది.

బెస్ట్ టైటిల్ డిజైన్: 1999లో ఈ క్యాటగిరీపై వచ్చిన ప్రపోజల్ రిజెక్ట్ అయ్యింది.

కాబట్టి ఆర్​ఆర్​ఆర్​ కూడా అఫిషియల్ సబ్మిట్​ గానీ అయితే ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీలో అవుతుంది కానీ ఎన్టీఆర్​ను యాక్టర్ కింద తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. దానికి మనం పైన చెప్పుకున్న 125 యూఎస్ రూల్స్​ను ఫాలో అయ్యి రాజమౌళి సినిమాను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా జరిగి ఉండకపోవచ్చు అనేది వాదన. అయితే వరల్డ్ మూవీ క్రిటిక్స్ చెప్పేందంటే ఆర్​ఆర్​ఆర్​ ఇండియా నుంచి కనుక ఇంటర్నేషనల్​ ఫీచర్ ఫిల్మ్​కి అఫీషియల్ సబ్మిషన్ గా వెళ్తే ఆస్కార్ సాధించే ఛాన్సెస్ చాలా ఎక్కువ అంటున్నారు. అలాగే శ్యామ్ సింగరాయ్ ఆస్కార్స్ కు సబ్మిట్ అయ్యిందని చెబుతున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్, పీరియాడిక్ ఫిల్మ్ కేటగిరీలు నిజం కాకపోవచ్చు. పైగా శ్యామ్ సింగరాయ్ విడుదలైన తేదీ 24డిసెంబర్ 2021. ఆ తేదీ ఆస్కార్ ఇచ్చిన కటాఫ్ డేట్​లో లేనే లేదు. జనవరి 1, 2022 నుంచి 30 నవంబరు 2022 లోపు విడుదలైన సినిమాలే ఆస్కార్స్​కు వెళ్తాయి కాబట్టి ఆస్కార్స్ కు శ్యామ్ సింగరాయ్ వార్తపై అనుమానాలు నెలకొన్నాయి. ఆస్కార్స్​కు సబ్మిట్ అయ్యిందనే వార్తల పైన శ్యామ్ సింగరాయ్ చిత్ర బృందం కానీ, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ స్పందించలేదు కాబట్టి ఈ వార్తల్లో నిజమెంతో వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version