సంగీత ప్రియులను అలరించేందుకు ఘనంగా ప్రారంభమైన జీ తెలుగు స రి గ మ ప ఛాంపియ‌న్‌షిప్‌

-

2022లో స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్తో మరింత ఉత్సాహంగా సరికొత్త సీజన్ స రి గ మ ప‌‌ ఛాంపియన్షిప్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మీ జీ తెలుగు. ఈసారి స్పెషల్ ఏంటంటే.. కొత్త కంటెస్టెంట్స్ మధ్య కాకుండా ఇదివరకు సీజన్లలో గెలిచిన ఛాంపియన్స్ మధ్య ఈ ఛాంపియన్షిప్ టైటిల్కోసం పోటీ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రతిభావంతులైన గాయకులకు ప్రత్యేక వేదికను అందించాలనే లక్ష్యంతో ప్రారంభిస్తున్న స రి గ మ ప ఛాంపియన్‌షిప్‌లో గత సీజన్‌లలోని విజేతలు, బెస్ట్ ఫెర్ఫామర్స్ ఆరుగురు చొప్పున నాలుగు జట్లుగా తలపడనున్నారు.

టాలెంట్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది జీ తెలుగు. డ్యాన్సింగ్, సింగింగ్ షోలతో మట్టిలో మాణిక్యాలను గుర్తించిన ఘనత జీ తెలుగుకే దక్కుతుంది. తెలుగులో సూపర్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సింగింగ్ షో ‘స రి గ మ ప’. ఈ షో అన్ని సీజన్లలో తమ స్వరంతో ప్రేక్షకులను అలరించి బాగా పాపులర్ అయిన గాయకుల మధ్యే పోటీ పెట్టి ఛాంపియన్స్లో ఛాంపియన్ ఎవరో గుర్తించే కాన్సెప్ట్తో ప్రారంభమైంది. ఈ సీజన్లో ప్రతి జట్టుకు ఒక మెంటర్ నాయకత్వం వహిస్తారు. ప్రతి ఒక్కరూ సోలో, డ్యూయెట్ మరియు గ్రూప్ ఫార్మాట్‌లలో పోటీ పడాల్సి ఉంటుంది.

స రి గ మ ప ఛాంపియన్‌షిప్ 29 జనవరి 2023న ప్రారంభమై ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు, మీ అభిమాన జీ తెలుగు ఛానల్లో ప్రసారం కానుంది.

ఈ సీజన్ ప్రకటించడంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన జీ తెలుగు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మీడియా ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రాండ్గా షో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఈ సీజన్లో భాగమైన ప్రతి ఒక్కరూ తమ తమ అనుభవాలను మీడియా ముఖంగా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సంగీత మహోత్సవంలో సంగీత పరిశ్రమలోని ప్రముఖులతో పాటు న్యాయనిర్ణేతలు – మనో, ఎస్.పి. శైలజ మరియు అనంత్ శ్రీరామ్, మెంటర్స్ శ్రీ కృష్ణ, – సాకేత్, పృథ్వీ చంద్ర మరియు రమ్య బెహరా సరిగమప ఛాంపియన్షిప్ విశిష్టత, ప్రాముఖ్యం గురించి మీడియాతో ముచ్చటించారు. ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న స రి గ మ ప ఛాంపియన్‌షిప్ ప్రేక్షకులకు వినోదం పంచుతుందనడంలో సందేహం లేదు.

స రి గ మ ప ఛాంపియన్ షిప్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ని హోస్ట్‌ చేసిన అన్నపూర్ణ రకరకాల AVలతో న్యాయనిర్ణేతలు, కంటెస్టెంట్ల సంగీత ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేశారు. స రి గ మ ప ఛాంపియన్‌షిప్‌ 29 జనవరి 2023 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు, జీ తెలుగులో మాత్రమే తప్పకుండా చూడండి.

ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడంపై జీ తెలుగు ఛానెల్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆఫ్ తెలుగు క్లస్టర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ, “గత దశాబ్దన్నర కాలంలో స రి గ మ ప విజయవంతంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే అద్భుతమైన అవకాశాన్ని సృష్టించింది. 2022లో స రి గ మ ప – ది సింగింగ్ సూపర్‌స్టార్ సూపర్ సక్సెస్తో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వ్యాప్తంగా అశేష అభిమానులను ఆకట్టుకుంది. అందుకే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన వ్యక్తులకు వారి ప్రతిభను మరోసారి ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడానికి స రి గ మ ప ఛాంపియన్‌షిప్ ప్రత్యేకమైన ఎడిషన్‌తో వచ్చాం.

సరికొత్త సీజన్ ఇదివరకు సీజన్లలోని ఛాంపియన్‌ల మధ్య పోటీతో మంచి వినోదాన్ని అందిస్తుందని నమ్ముతున్నా. భారీ అంచనాలతో, స రి గ మ ప ఛాంపియన్‌షిప్‌ను పరిపూర్ణంగా ప్రారంభించాలనుకుంటున్నాము. అందుకే, సంగీత సాయంత్రంతో పాటు ప్రత్యేకమైన విలేకరుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. తెలుగు ప్రేక్షకుల అభిమానం మాపై ఎల్లప్పుడూ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాం.”

స రి గ మ ప ఛాంపియ‌న్‌షిప్ హోస్ట్ ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ, “తెలుగు టెలివిజన్ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక రియాలిటీ షోలలో స రి గ మ ప ఒకటి. ఈ ఐకానిక్ షోలో మరోసారి భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈసారి షోలో ట్విస్ట్ ఏంటంటే.. పోటీ కొత్త కంటెస్టెంట్స్ మధ్య కాదు, ఛాంపియన్స్ మధ్య. ఇది జీ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభవం అవుతుంది.”

ఛాంపియన్‌లతో స రి గ మ ప ఛాంపియన్‌షిప్‌తో ఈ ఉత్తేజకరమైన సంగీత ప్రయాణంలో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి, జనవరి 29 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు కేవలం జీ తెలుగులో మాత్రమే!

Read more RELATED
Recommended to you

Exit mobile version