అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌.. పూనకాలే

-

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. మొదటి సీజన్ ను విజయవంతంగా ఎండ్ చేసిన బాలయ్య రెండో సీజన్ ను కూడా విజయవంతంగా ఎండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సినిమా, రాజకీయ నాయకులతో రెండవ సీజన్ ఫుల్ హాట్ హాట్ గా సాగింది. ఇక ఈ రెండో సీజన్ కూడా చివరి దశకు చేరుకొంది. ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఏ టాక్ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్ మొదటిసారి బాలకృష్ణ షో లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోస్ రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే మేకర్స్ ప్రోమోస్ తోనే హైప్ ఎక్కువ పెంచేశారు. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన కొత్త ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. 4 నిముషాలు ఉన్న ఈ ప్రోమో ఆద్యంతం ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించింది. పవన్ గ్రాండ్ ఎంట్రీ, బాలయ్య సరదా మాటలు, పవన్ సోల్ ఫుల్ నవ్వు.. అభిమానుల కళ్లలో ఆనందం.. వెరసి ప్రోమో మొత్తం కన్నుల పండుగగా కనిపించింది. ప్రభాస్ ఎపిసోడ్ లానే పవన్ ఎపిసోడ్ ను కూడా రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక బాలయ్య సరదాగా మొదలుపెట్టిన ప్రశ్నలు.. చివరికి సీరియస్ గా మారిన విధానం కనిపించింది. ఈశ్వరా.. పరమేశ్వర.. పవనేశ్వర అంటూ బండ్ల గణేష్ ను ఇమిటేట్ చేస్తూ బాలయ్య మాట్లాడిన తీరు నవ్వులు పూయిస్తోంది. ఇక గుడుంబా శంకర్ లో ఫ్యాన్ ట్ మీద ప్యాంట్ వేయడం దగ్గరనుంచి ప్రశ్నల వర్షం కురిపించాడు బాలయ్య. ఇక త్రివిక్రమ్ తో స్నేహం, అన్న చిరుతో అనుబంధం, మూడు పెళ్లిళ్లు, రాజకీయాలు ఇలా సెరియస్ టాపిక్స్ తో పాటు పవన్ చిన్నతనాన్ని కూడా బాలయ్య వెలికి తీసాడు. ఇక మధ్యలో రామ్ చరణ్ కు ఫోన్ చేసి ఫిట్టింగ్ మాస్టర్ అని బాలయ్య సంబోధించడం నిజంగా ఆశ్చర్యాన్ని రేకెత్తించే విషయమే. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎంట్రీతో మరిన్ని నవ్వులు పూశాయి. మామ మూడ్ను చేతులు కట్టుకొని ఆయన దగ్గరనుంచి ఏం నేర్చుకున్నాడో చెప్పడం.. దానికి పవన్ కౌంటర్ వేయడం ఆకట్టుకుంది. తేజ్ సైతం తొడకొట్టు అని బాలయ్య అనగానే డైరెక్ట్ గా వెళ్లి బాలయ్య తొడమీద కొట్టడం అభిమానుల ముఖం మీద నవ్వులు తెప్పించింది. ఇక చివర్లో పవన్ మూడు పెళ్లిళ్ల విషయం ఎత్తి షో మొత్తం హీట్ ఎక్కించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version