నేషనల్ వైడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో ఆగస్టు 30 న భారీగా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోన్న కొద్ది సాహో లవర్స్‌లో టెన్షన్ ఎక్కువ అవుతోంది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్ కావడంతో సహజంగానే సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్‌గా ఉంటుందన్నది స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు రెండు సంవత్సరాల పాటు కొన్ని వేల మంది కష్టంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక ఇంత గొప్పగా తీసిన సినిమా ఫైనల్‌గా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కట్ అవుతుంటే ఎవరికి అయినా సహజంగా బాధ అనిపిస్తుంది. ఇలా సాహో కోసం కోసం ఎక్కువగానే సీన్లు ట్రిమ్ చేసేశారట. మొత్తం సినిమా 20 నిమిషాల పాటు కట్ చేసి ఫైనల్ రన్ టైం మూడు గంటలకు ఓ 10 నిమిషాలు తక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయ్యాక.. కొన్ని బోర్‌గా ఉన్నాయనుకున్న సీన్లు కట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే కోట్లు ఖర్చు పెట్టి తీసిన రెండు యాక్షన్ కట్స్ కూడా లేపేశారట. సినిమా మరీ లెన్దీగా లేకుండా ఉండేందుకే ఈ సీన్లు ట్రిమ్ చేశారంటున్నారు. ఈ సీన్లు ట్రిమ్ చేయడం వల్ల ఎంతో డబ్బు వృధా అయినా కానీ నిర్మాతలు కాస్త బాధతోనే దగ్గరుండి మరీ ఎడిట్ చేయించినట్టు తెలుస్తోంది.
ఏదేమైనా సాహో ఫైనల్ రన్ టైం 172 నిమిషాలకు కాస్త అటూ.. ఇటూగా ఉండొచ్చని తెలుస్తోంది. త్వరలో సెన్సార్‌కు వెళుతోన్న సాహో ప్రమోషన్లు స్పీడప్ చేసేందుకు సినిమా యూనిట్ రెడీ అవుతోంది.