Sabapathy Dekshinamurthy: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.
అయితే తాజాగా తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి… మరణించడం జరిగింది. ముద్దుగా సభాపతి దక్షిణామూర్తిని ఎస్ డి సభ అని పిలుస్తారు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యంతో తాజాగా మృతి చెందారు. 61 సంవత్సరాలు ఉన్న.. దక్షిణామూర్తి… ఆసుపత్రిలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈయన సినిమా కెరియర్ విషయానికి వస్తే… తమిళంలో విజయ్ కాంత్ హీరోగా భారతన్ అనే సినిమా చేసి… దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. ఇక తెలుగులో జగపతిబాబు హీరోగా చేసిన పందెం సినిమాను 2005లో తీశారు. ఈ సినిమాకు దర్శకత్వం దక్షిణామూర్తి చేసిన సంగతి తెలిసిందే. దాదాపు పది సినిమాలకు దర్శకత్వం వహించారు దక్షిణామూర్తి. ఇక సభాపతి దక్షిణామూర్తి మృతి పట్ల ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేస్తుంది.