SAAHO : `సాహో` ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్‌ కలెక్ష‌న్స్

-

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ర‌న్ ర‌జా ర‌న్‌ ఫేమ్ సుజిత్ కాంబినేష‌న్‌లో `సాహో` ఈ రోజు థియేట‌ర్‌లో సంద‌డి చేస్తోంది. ఈ  యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టించింది. దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ్ మ‌రియు మ‌ళ‌యాల భాష‌ల్లో ఒకే సారి విడుద‌ల అయింది. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న మూవీ కావ‌డంతో ఇటు తెలుగుతో పాటు కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్‌, బాలీవుడ్‌లో సైతం సాహో ఫీవ‌ర్ మామూలుగా లేదు.


భారీ అంచనాలు, ప్రీ-రిలీజ్ హైప్ మధ్య ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో డే 1 రికార్డుల బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశం ఉంద‌ని కూడా ట్రేడ్ వ‌ర్గాలు ముందుగా అంచ‌నా వేశాయి. ఇక యుఎస్‌లో, సాహో 290 ప్రదేశాల నుండి రాత్రి 10 గంటల వరకు మంచి $ 800,899 డాల‌ర్లు అంటే ఐదు కోట్ల‌కుపైగా వసూలు చేసింది. ఈ చిత్రం ప్రీమియర్స్ నుండి  1 మిలియన్ క్లబ్‌లోకి ప్రవేశించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఏదేమైనా, అల్ట్రా పాజిటివ్ ప్రీ-రిలీజ్ బజ్ మరియు సినిమాను కొన్న రేట్ల‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ వ‌సూళ్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. మ‌రి ఈ వీకెండ్ చివ‌ర‌కు సినిమా ఎంతగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఇక  ఈ చిత్రంలో చుంకీ పాండే,  జాకీష్రాప్‌, నీల్ నితిన్‌, మందిరాబేడీ, కోలీవుడ్ న‌టుడు అరుణ్‌ విజ‌య్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు న‌టించారు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌మోద్ – వంశీ ఈ సినిమాను నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news