‘ సాహో ‘ పై సోమ‌వారం స‌ర్‌ఫ్రైజ్ న్యూస్‌

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సిని ఫీవ‌ర్ ప్ర‌స్తుతం ఇండియాను ఊపేస్తోంది. సాహో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో మూడు రోజుల టైం మాత్ర‌మే ఉంది. గురువారం అర్ధ‌రాత్రి నుంచే ప్రీమియ‌ర్ల హ‌డావిడి ఎలాగూ ఉంటుంది. ఇప్ప‌టికే గ‌త నెల రోజులుగా సాహో అప్‌డేట్ల విష‌యంలో ఏదో ఒక స‌ర్‌ఫ్రైజ్ వ‌దులుతూనే ఉన్నారు. టీజ‌రో, ట్రైల‌రో, సాంగ్స్‌, ప్రి రిలీజ్ ఈవెంట్లు ఇలా సాహో ర‌చ్చ మామూలుగా లేదు.


ఇక ప్ర‌భాస్ ఇదే జోష్‌లో దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు మరో సర్‌ప్రైజ్ అందించబోతున్నారు. సాహో సినిమాలోని నాలుగో పాటను సోమవారం విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా ప్రభాస్ వెల్లడించారు. `బేబీ ఓన్ట్‌ యు టెల్‌ మీ..` అంటూ సాగే పాట పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన `సాహో` ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ అండర్ కవర్ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించింది. సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ సీక్వెల్స్ హైలెట్‌గా నిలుస్తాయ‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version