పెళ్లికి రెడీ అయిన ధరమ్ తేజ్…సారీ ప్రభాస్ అన్నా అంటూ !

-

లాక్ డౌన్ మన తెలుగు హీరోలకి కలిసోచ్చినంత బాగా ఇంకా ఎవరికీ కలిసి రాలేదేమో ? మామూలుగా షూట్ లు, ప్రమోషన్స్ అంటూ తెగ బిజీగా ఉండే తెలుగు హీరోలు, దర్శకులు ఈ లాక్ డౌన్ టైం లో పెళ్ళిళ్ళ బాట పట్టారు. ఇప్పటికే ముగ్గురు కుర్ర హీరోలు పెళ్ళిళ్ళు చేసుకోగా, సుజీత్ లాంటి దర్శకులు సైతం పెళ్లి చేసేసుకున్నారు. అయితే ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన వదిలిన వీడియో అలాంటిది మరి. కొద్ది సేపటి క్రితం ఆయన ఒక వీడియో వదిలాడు.


“ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….” అంటూ తమ సింగిల్స్ ఆర్మీ వాట్సాప్ గ్రూప్ లో ప్రభాస్ అన్న సారీ అని చెప్పి తాను కూడా ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యిపోయాడు. అయితే ఈ వీడియో వెనుక కాస్త మ్యూజిక్ టచ్ కూడా ఇవ్వడంతో ఇది నిజమైన పెళ్లి పిలుపా లేక ఏదయినా మూవీ ప్రమోషనా అనేది తేలాల్సి ఉంది. అయితే అసలు విషయం తెలియాలి అంటే రేపు ఉదయం 10 గంటల వరకు వెయిట్ చెయ్యాలని ఆ వీడియోలో పేర్కొన్నారు. చూద్దాం మరేమవుద్దో ?

Read more RELATED
Recommended to you

Exit mobile version