Sai Pallavi: సాయిపల్లవి సర్‌ప్రైజ్..రివీల్ అయ్యేది అప్పుడే!

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపైన సాయి పల్లవి కనబడితే చాలు..ఆనందమే అనేంతలా సినీ అభిమానులపైన ఆమె ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సహజ నటనకు కేరాఫ్ గాఉంటూ తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది సాయిపల్లవి అలియాడ్ లేడీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

‘ఫిదా’ చిత్రంలో జనాన్ని ఫిదా చేసిన ఈ బ్యూటీ..తెలుగు ప్రేక్షకులకు చివరగా నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ పిక్చర్ లో కనిపించింది. ఆ సినిమా తర్వాత ఇంకా ఏ చిత్రంలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. కాగా, ఆమె నటించిన ‘విరాట పర్వం’ ఈ ఏడాది జూలై 1న విడుదల కానుంది.

సాయిపల్లవి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నదని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ సాయిపల్లవి ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్టు కూడా చర్చనీయాంశమవుతోంది. తన కాళ్లు మాత్రమే కనబడేలా ఓ ఫొటో షేర్ చేసిన సాయిపల్లవి..ఆశ్చర్యమైన విషయం కొంత కాలం దాచబడింది.

ఈ నెల 9న రివీల్ కాబోతున్నదని అన్నట్లుగా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అది చూసి ఏదో సర్ ప్రైజ్ సాయిపల్లవి ఇవ్వబోతుందన్న చర్చ జరుగుతోంది. ‘విరాట పర్వం’ పిక్చర్ నుంచి ‘వెన్నెల’ సాంగ్ ను ఈ నెల 9న సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version