భానుమతి ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి.. మారాల్సిందే..!

-

మళయాళ ప్రేమం సినిమాతో సౌత్ అంతటా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న హీరోయిన్ సాయి పల్లవి. అక్కడే కాదు భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అని అదరగొట్టిన ఈ అమ్మడు ఫిదా సినిమాతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఎం.సి.ఏ కూడా సక్సెస్ అయ్యింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ గాళ్ గా సాయి పల్లవి చేస్తున్న ప్రతి సినిమాలో అటు ఇటుగా అలాంటి పాత్రలనే చేస్తుంది.

అదీకాకుండా తన వాయిస్ కాస్త రఫ్ గా రావడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. ఏదైతే భానుమతిలోని డేర్ నెస్ చూసి ఇష్టపడ్డారో ఇప్పుడు అదే డేర్ నెస్ అన్ని సినిమాల్లో చూసేసరికి భానుమతి మారాల్సిందే అంటున్నారు. భానుమతి లాంటి పాత్రలను ఏదో ఒకటి రెండు సినిమాల్లో బాగుంటుంది. సాయి పల్లవి అనగానే డేరింగ్ గర్ల్ అనేలా సినిమా పాత్రలు వస్తున్నాయి. కోలీవుడ్ లో కూడా సాయి పల్లవి చేసిన మారి 2 సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే అందులో కూడా ఆమె ఇంచుమించి తను చేసిన పాత్ర మాదిరే ఉంది. మరి ఇలానే చేస్తూ పోతే సాయి పల్లవి అనగానే భానుమతి మాత్రమే గుర్తొస్తుంది. అలా కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తే బెటర్ లేదంటే అమ్మడికి ఇప్పుడు అవకాశాలు వస్తున్నా తర్వాత తగ్గుముఖం పడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version