బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడికి పాల్పడినటువంటి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్ గడ్ లోని దుర్గ్ లో అతన్ని గుర్తించారు రైల్వే పోలీసులు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా.. నిందితుడిని పట్టుకొని వీడియో కాల్ ద్వారా ముంబయి పోలీసులతో మాట్లాడి అతడేనని ధృవీకరించుకున్నారు. రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తీసుకొచ్చేందుకు ముంబయి పోలీసులు బయలు దేరి ఛత్తీస్ గడ్ కు వెళ్తున్నారు.
గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు సైఫ్ అలీఖాన్ పై ఈ దాడి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్, అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చోరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్ అలీఖాన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారయ్యాడు నిందితుడు. ఈ మేరకు ముంబయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు.