Saipallavi : కూలీగా మారిన సాయిపల్లవి.. ఫొటోలు వైరల్‌

-

అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి మలయాళం ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకొని వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కించుకుంది.

స్టార్‌ హీరో మూవీ అయినా… యంగ్ హీరో సినిమా అయినా.. అందులో చెల్లిపాత్రైనా.. హీరోయిన్‌ రోల్ అయినా.. ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాయిపల్లవి. ఇది ఇలా ఉండగా.. ఇక ఇటీవలే శ్యామ్‌ సింగరాయ్‌ తో ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి ప్రస్తుతం షూటింగ్‌ కు కాస్త విరామం ఇచ్చింది.

ఉగాది పర్వదినాన్నిపురష్కరించుకుని.. ఆమె రైతుగా మారింది. కూలీలతో కలిసి పనులు చేసింది. అయితే.. ఈ ఫోటోలను సాయిపల్లవి తన ఇన్‌ స్టా లో అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోల్లో సాయి పల్లవి మరింత ముద్దుగా కనిపించడంతో.. విపరీతంగా వైరల్‌ గా మారాయి. సాయిపల్లవి నీలా ఎవ్వరూ ఉండలేరంటూ నటి శ్రద్ధా శ్రీనాథ్‌ ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version