బాక్సాఫీస్ వద్ద ‘సలార్’ ఊచకోత.. 10 రోజుల్లో రూ.625 కోట్ల వసూళ్లు

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు బాహుబలి తర్వాత సూపర్ సక్సెస్ను అందించిన సినిమా సలార్. డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఖాన్సార్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.625 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రేక్షకులు రిపీట్గా థియేటర్లకు వెళ్తున్నారు.

శనివారం రోజున ఈ సినిమా రూ.12.55 కోట్లు సాధించగా, ఆదివారం రూ.15.74 కోట్లు రాబట్టింది. భారత్లో ఈ సినిమా రూ.346.88 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా రిలీజ్ రోజు రూ.178.7 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని అంతకుముందు చిత్ర బృందం తెలిపిన విషయం తెలిసిందే. 2023లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సలార్ రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించగా శ్రుతి హాసన్ కథానాయికగా సందడి చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version