ఇజ్రాయెల్ పై ఎదురుదాడి.. రాకెట్లతో విరుచుకుపడ్డ హమాస్

-

ఇజ్రాయెల్, హమాస్ వద్ద భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు కొత్త ఏడాది తొలి రోజే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు మూడు నెలలుగా గాజాపై బాంబు దాడులతో ఇజ్రాయెల్ విరుకుపడుతున్న ఇజ్రాయెల్పై హమాస్ తీవ్రంగా విరుచుకుపడింది.గాజా నుంచి వందలాది రాకెట్లతో హమాస్ ఇజ్రాయెల్పై దాడికి తెగబడింది. వాటిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోగా పెద్ద శబ్దాలతో ఆకాశంలో పేలుళ్లు సంభవించాయి.

దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఈ రాకెట్లు పడినట్టు సమాచారం. హమాస్ వందలాది రాకెట్లను ప్రయోగించినా ఎవరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. 2023 అక్టోబర్ 7 న ఇజ్రాయెల్ పై 2వేల రాకెట్లతో హమాస్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రతీకార చర్యతో రగులుతున్న ఇజ్రాయెల్ హమాస్ను అంతం చేయాలనే లక్ష్యంతో గాజాపై విరుచుకుపడుతూనే ఉంది. ఇప్పుడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై ప్రతి దాడులు చేశారు. మరోవైపు గాజాలోని ఉత్తర ప్రాంతం నుంచి వేల సంఖ్యలో ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లడం చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version