వాట్సాప్ ఛానెల్ లోనే సలార్ అప్డేట్..!

ఇండియా సినీ ఇండస్ట్రీలోనే పాన్ ఇండియా స్టార్స్ గా కొనసాగుతున్న ప్రభాస్..కేజీఎఫ్ మూవీతో సెన్సేషన్ విజయాన్ని సాధించి పాన్ ఇండియా అగ్ర దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సలార్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన విడుదలైనప్పటి నుంచి అభిమానుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే సలార్ మూవీకి సంబంధించి మినీ టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ డైనోసార్ తో పోల్చడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి.

ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా యొక్క నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ తాజాగా వాట్సాప్ ఛానల్ ఏర్పాటు చేసింది. ఈ ఛానల్ లో ఎక్స్ క్లూజివ్ కంటెంట్ తో పాటు సినిమాల అప్డేట్.. మరికొన్ని సర్ ప్రైజ్ లు రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. దీంతో పాటు.. సలార్ రిలీజ్ డేట్, మిగతా అప్డేట్స్ కూడా వాట్సాప్ ఛానల్ లోనే రిలీజ్ చేస్తామని తెలిపింది. కొత్త విడుదల తేదీని ఈనెల 28న ప్రకటించే అవకాశముంది. వాస్తవానికి సెప్టెంబర్ 28న సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అయితే సలార్ మూవీ ఎప్పుడూ విడుదల చేసేది సెప్టెంబర్ 28న క్లారిటీ రానుంది.