బ్రేకింగ్ న్యూస్ : బీఆర్ఎస్ లో చేరనున్న ఏపూరి సోమన్న..!

ఏపూరి సోమన్న గురించి తెలంగాణలో దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తొలుత కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహించారు ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న. ఇక ఆ తరువాత తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ వైయస్‌ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో షర్మిల వెంట నడవనున్నట్టు ప్రకటించారు ఏపూరి సోమన్న. చాలా రోజుల పాటు షర్మిలతో కొనసాగారు. ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీవైపు చూడడటం.. కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తుండటంతో ఏపూరి సోమన్న బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.


తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను తన అనుచరులతో కలిసి భేటీ అయ్యారు ఏపూరి సోమన్న త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇటీవలే షర్మిల పార్టీకి రాజీనామా చేశారు. ఏపూరి సోమన్న బీఆర్ఎస్ లో చేరితే సాంస్కృతికానికి బీఆర్ఎస్ లో కొదవనే లేదని చెప్పవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసెంబ్లీలో సైతం తన కళను అప్పుడప్పుడు ప్రదర్శరిస్తున్నారు.