నాగ చైతన్య-శోభిత డేటింగ్‌.. నేనలా అనలేదంటూ సమంత క్లారిటీ

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నాగచైతన్య మరో హీరోయిన్ శోభితా ధూలిపాళతో డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు వస్తున్నాయి. ఈ ఇద్దరూ రెండు మూడు సార్లు కలిసి కనిపించడంతో వీటికి మరింత బలం చేకూరింది. వీరి డేటింగ్ రూమర్లపై సమంత వ్యాఖ్యలు చేసినట్టుగా ఓ మీడియా రాసిన కథనంపై సమంత స్పందించింది. ఆ ఆర్టికల్‌ను ట్యాగ్ చేస్తూ తాను అలా అనలేదని ట్వీట్ చేసింది.

‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న ​సమంత… తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. తనతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య.. హీరోయిన్​ శోభిత ధూళిపాళ మధ్య రిలేషన్​ ఉన్నట్లు వస్తున్న పుకార్లపై సామ్​ స్పందించినట్లు కథనాలు వస్తున్నాయి. చైతూ పేరు చెప్పకుండా.. “ఎవరు ఎవరితో రిలేషన్​షిప్​లో ఉన్నారని నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వారికి ఎంత మందితో డేట్ చేసినా, చివరికి మిగిలేది కన్నీరే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పినట్లు పలు వెబ్​సైట్లు కథనాలు రాస్తున్నాయి. అయితే ఈ మాట విన్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్​కు గురౌతున్నారు.

అయితే ఈ ప్రచారంపై సమంత సోషల్​మీడియా వేదికగా స్పందించింది. తాను అలా అనలేదంటూ చెప్పుకొచ్చింది. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టిపారేసింది. ఓ వైబ్​సైట్​ కథనాన్ని ప్రస్తావిస్తూ.. ‘నేను ఇలా చెప్పలేదు’ అని ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version