హెచ్‌సీయూ భూములపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా మీడియాతో మాట్లాడారు. ‘ఫ్యూచర్ సిటీ కోసం 14 వేల ఎకరాలు పెట్టుకుని ఇక్కడ ప్రెసెంట్ సిటీని ఎందుకు నాశనం చేస్తున్నారు.
పశ్చిమ హైదరాబాద్‌లో ఉన్న ఒకేఒక లంగ్ స్పేస్ అది.. దాన్ని ఎందుకు కరాబ్ చేస్తున్నావు. అక్కడ ఉండే జంతువులకు నోరు లేదు.. నీ ఎమ్మెల్యేలకు, మంత్రులు నోర్లు ఏమయయ్యి. దేశం మొత్తం వినపడుతుంది కానీ మీకు వినబడటం లేదా?’ అని కేటిఆర్ ప్రశ్నించారు. ఇదిలాఉండగా, తమ ప్రభుత్వం వచ్చాక అదే 400 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుని అందులో ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది.