స్నేహితుడి సినిమాకు తనవంతుగా సాయం అందిస్తున్న సమంత….!!

-

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఏ మాయ చేసావే అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చుల్ బులి సమంత రూత్ ప్రభు, ఆ సినిమాలో హీరో నాగచైతన్యతో కలిసి నటించి తన అందం మరియు అభినయంతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టిన సమంత, ఆ తరువాత ఒక్కొక్కటిగా తన వస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగింది. ఇక ఇటీవల తన తొలి సినిమా హీరో చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత, ఒకప్పుడు మాదిరిగా సినిమాలు చేయడం కొంత తగ్గించారు అనే చెప్పాలి.

కథా పరంగా ప్రాధాన్యత ఉన్న సినిమాలకే ఓట్ వేస్తున్న సమంత, ఇటీవల ఓ బేబీ, యూ టర్న్ సినిమాలతో మంచి విజయాలని అందుకున్నారు. ఇక ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ 96 రీమేక్ మూవీగా తెరకెక్కుతున్న జాన్ లో నటుడు శర్వానంద్ తో కలిసి నటిస్తున్నారు సమంత. ఇకపోతే తనతో కలిసి ఓ బేబీ సినిమాలో నటించిన యువ నటుడు నాగ శౌర్య లేటెస్ట్ మూవీ అశ్వద్ధామ ఫస్ట్ లుక్ టీజర్ ని తన చేతులమీదుగా ఆమె రిలీజ్ చేయనున్నారు.

రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఆ సినిమా టీజర్ ని తన చేతులమీదుగా రిలీజ్ చేయనున్న సమంత, తనకు నాగ శౌర్యతో ఓ బేబీ సినిమా సమయంలో మంచి అనుబంధం ఏర్పడిందనిఆ తరువాత నాకు మంచి మిత్రుడైన శౌర్య, తన లేటెస్ట్ మూవీ అశ్వద్ధామను సొంతంగా తమ ఓన్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని, తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవుతుందని శౌర్యకు సమంత విష్ చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి సమంతకు టాలీవుడ్ లో గోల్డెన్ హ్యాండ్ భామ అనే పేరుండడంతోనే, శౌర్య తన సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఆమె చేతులమీదుగా రిలీజ్ చేయిస్తున్నాడు అనే వార్తలు కూడా ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం అవుతున్నాయి. మరి కొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version