అక్కినేని కోడలా మజాకా..!

-

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కోడలిగా మారాక సినిమాల పరంగా ఆచి తూచి అడుగులేస్తున్నా తన పర్సనల్ విషయాల్లో మాత్రం అమ్మడు దూసుకెళ్తుంది. ఫిట్ నెస్ మీద మొదటి నుండి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న సమంత జిమ్ వర్క్ అవుట్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. ఎంచక్కా పెళ్లయ్యింది పిల్లలు కనే టైంలో ఇలాంటి టాస్కులు అవసరమా అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టుగా తను ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తుంది సమంత.

చైతుతో ఈమధ్యనే జాలీ ట్రిప్ వేసి వచ్చిన సమంత తన రెగ్యులర్ వర్క్ అవుట్స్ చేస్తుంది. తను చేయడమే కాదు ఆ వీడియోలు, ఫోటోలు షేర్ చేసి తన ఫ్యాన్స్ కు స్పూర్తిగా నిలుస్తుంది సమంత. అక్కినేని కోడలిగా సమంత అటు సినిమాలతో పాటుగా పర్సనల్ కేర్ కూడా బాగా చూసుకుంటుంది. యూటర్న్ తర్వాత మిస్ గ్రానీ రీమేక్ లో నటిస్తున్న సమంత ఆ సినిమాతో పాటుగా తమిళంలో కూడా సూపర్ డీలక్స్ సినిమా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version