డిప్రెషన్లో సమంత.. ఫ్లాప్ క్వీన్ అంటూ ట్వీట్ వైరల్..!

-

ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ఈమధ్య కాలంలో తరచుగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. సినీ సెలబ్రిటీలపై సెన్సేషనల్ ట్వీట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత పై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.. ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా రీసెంట్గా విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

విడుదలకు ముందు భారీ హైప్ వచ్చినప్పటికీ కూడా ఆశించిన మేర కలెక్షన్స్ అయితే రావడం లేదు.ఇక సమంతా నటనపై పాజిటివ్ టాక్ వచ్చింది కానీ సినిమాపై మాత్రం అంతగా బజ్ ఏర్పడలేదు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు పెట్టిన ట్వీట్ చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. శాకుంతలం రిజల్ట్ చూసి సమంత డిప్రెషన్ లోకి వెళ్ళింది అంతేకాదు ఆమెను ఫ్లాప్ క్వీన్ అంటూ సమంత ను ఉద్దేశించి.. ఉమైర్ ట్వీట్ చేయడం ఇప్పుడు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇక శాకుంతలం సినిమా భారీ డిజాస్టర్ అయిందని నిర్మాతలకు నష్టాలు తప్పవు అంటూ ఉమైర్ సంధు తెలిపాడు. అంతేకాదు సమంత కెరియర్ ఇక ఈ సినిమాతో ముగిసిపోయింది అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన సమంత అభిమానులు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు .అంతకుముందు టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబు కూడా సమంత కెరియర్ ఫినిష్ అయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తోంది. దూకుడుగా సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా అందుకోలేకపోతున్నాయి. ఇక ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా పైనే ఉంచిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా సమంతకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news