స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న సంఘటన తెలిసిందే. తాజాగా సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి విదేశాలలో పర్యటిస్తున్నారు. అమెరికాలోని డేట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫోటోలను సమంత ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో రాజ్ నిడిమోరు సమంత భుజంపై చేయి వేసి ఫోటోలకు స్టిల్ ఇచ్చారు.

కాగా, గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లుగా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ విషయం పైన ఇప్పటి వరకు సమంత గానీ, రాజ్ గానీ రియాక్ట్ అవలేదు. గతంలో వీరిద్దరూ కలిసి దుబాయ్ పర్యటనకు కూడా వెళ్లారు. చాలా సందర్భాలలో బయట కనిపించారు. ఈ వార్తలపై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.