టాలీవుడ్ స్టార్ హీరోయిన్ దుబాయ్ వెకేషన్ లో బిజీగా ఉన్నారు. సమంత ప్రస్తుతం దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఎడారి ప్రాంతంలోని అందాలను వీక్షిస్తూ సమంత ఆనందంగా ఉన్నారు. అక్కడ సమంత తీసుకున్న ఫోటోలు, వీడియోలను తన అభిమానులతో ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతే కాకుండా “ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి శబ్దాలు, గొడవలు, హడావిడి లేదు లేకుండా ప్రశాంతంగా ఉంది” అని ఆమె రాసుకోచ్చారు.

కాగా, ప్రస్తుతం సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమా పాజిటివ్ టాక్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత ఓవైపు హీరోయిన్ గా నటిస్తునే మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించారు. ఎప్పుడు బిజీగా ఉండే సమంత వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో తన అభిమానులు సంతోషపడుతున్నారు. మీరు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. దుబాయ్ వెకేషన్ పూర్తయిన అనంతరం సమంత మళ్ళీ ఎప్పటిలానే సినిమా షూటింగ్ లలో పాల్గొంటారు. ఈ ఫోటోలు చూసి బాయ్ ఫ్రెండ్ తో సమంత ఎంజాయ్ చేస్తోందని అంటున్నారు.
"Everything feels stripped back out here.
No noise, no rush… just space to be."
~ @Samanthaprabhu2! 😍 (1/2)🔗 https://t.co/tG3hraRWvI#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/vdkrjuKjCR
— Samantha FC || TWTS™ (@Teamtwts2) June 5, 2025