మానసికంగా అలసిపోతే ఎదురయ్యే లక్షణాలు ఇవే..!

-

శారీరక ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యం కూడా ఎంతో అవసరం. జీవితంలో ప్రతి రోజు ఆనందంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. చాలా శాతం మంది చిన్న చిన్న విషయాలకు ఎంతో ఒత్తిడిని తీసుకుంటారు, దాని వలన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడైతే మానసికంగా అలసిపోతారో, ఇటువంటి లక్షణాలను ఎదుర్కొంటారు. కనుక ఈ సంకేతాలు కనిపిస్తే కచ్చితంగా జాగ్రత్త వహించాలి. చాలా మంది కొన్ని రకాల పనులను చేయడం వలన ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే, ఒకప్పుడు ఇష్టపడిన పనులను ఇప్పుడు చేయకుండా, ఇష్టం తగ్గినట్లు అనిపిస్తే, మానసికంగా అలసిపోయినట్లు అర్థం.

అంతేకాకుండా, ప్రతిరోజు చేసేటువంటి పనులకి సంబంధించి ఇతరుల భరోసా తీసుకుంటున్నట్లయితే, మానసికంగా అలిసిపోయారు అని సంకేతం. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడడం, ఒత్తిడిగా భావించడం మరియు సహాయం కోసం ఎదురు చూడడం కూడా ఇవి లక్షణాలు. ఎప్పుడైతే మానసికంగా అలసిపోతారో, ఇతరుల నుండి దూరంగా ఉండాలని భావిస్తారు మరియు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది కూడా మానసికంగా బాధపడుతున్నట్లు తెలియజేస్తుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడటం, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో ఎమోషనల్ సపోర్ట్ కోసం ఇతరుల పై ఆధారపడుతూ ఉంటారు. అయితే, మరికొన్ని సందర్భాల్లో కోపం మరియు బాధ ఎక్కువగా ఉంటాయి. దీంతో త్వరగా నిర్ణయాలు తీసుకుని, దూకుడుగా ప్రవర్తిస్తారు. దీని వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మానసికంగా అలసిపోయినప్పుడు నెగిటివ్‌గా ఆలోచించడం సహజం. దీనివల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మరియు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కనుక ఇటువంటి లక్షణాలు ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news