సమంత కి ఇది గట్టి దెబ్బే ..ఇంకోసారి ఈ తప్పు చేయదు ..!

-

అక్కినేని సమంత-శర్వానంద్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జాను’. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాను తెలుగులో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. సమంత గత చిత్రాలు మజిలీ, ఓ బేబి సూపర్ హిట్స్ అందుకోవడం తో ఈ సినిమా మీద భారీగా అంచానాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను ‘జాను’ అందుకోలేకపోయింది.

 

ఇక వాస్తవంగా ఈ సినిమాలో ముందు నాగ చైతన్య-సమంత లని నటింపచేయాలని దిల్ రాజు ప్లాన్ చేశారు. మజిలీ మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేయాలనుకున్నారు. కానీ నాగ చైతన్య ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి చూపించకుండా దిల్ రాజు ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు. కాని సమంత మాత్రం లాక్ అయిపోయింది. మొహమాటానికి పోయి మోసపోయింది. దిల్ రాజు సమంత చేయను అన్నప్పటికి పట్టు బట్టి సమంతని జాను కోసం ఒప్పించారు. సినిమా హ్యాట్రిక్ హిట్ అవుతుందని నమ్మించారు.

దాంతో సమంత కూడా రాజుగారి మాటలని నమ్మి ప్రాజెక్ట్ కి కమిటయింది. కాని జాను రిలీజయ్యాక డిజాస్టర్ గా నిలిచింది. సమంత నటన ని ప్రేక్షకులు మెచ్చుకున్నప్పటికి తన ఖాతాలో మాత్రం భారీ డిజాస్టర్ పడింది. ఇక శర్వానంద్ తో సమంత నటించినందుకు తనని కామెంట్ చేస్తున్నారు. ఇన్ని సినిమాలు చేసిన అనుభవం ఉన్నా కూడా సమంత జాను సినిమా విషయంలో టోటల్ గా రాంగ్ స్టెప్ వేసిందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే సమంత కి జాను సినిమా గట్టి దెబ్బే అని చెప్పాలి. ఇంకోసారి ఇలా రీమేక్ సినిమాని కమిటయి తప్పు చేయకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version