Sammelanam Movie Review : ఈటీవీ విన్‌లో అదరగొడుతున్న ‘సమ్మేళనం’

-

ఈ మధ్య కాలంలో రక రకాల సినిమాలు వస్తున్నాయి. అయితే.. కొన్ని సినిమాలు కూడా పెద్ద సినిమాలకు పోటీనిస్తున్నాయి. స్నేహం, ప్రేమ, బ్రేకప్ వంటి అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్ లతో తీసే సినిమాలు అయినా, వెబ్ సిరీస్ లు అయినా ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో చేసిన “సమ్మేళనం” సిరీస్ ఈటీవీ విన్ లోకి వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ వెబ్ సిరీస్ ను వీక్షిస్తున్నారు. సమ్మేళనం సిరీస్ ఓటిటిలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Sammelanam streaming in ETV Win

ప్రియా వడ్లమాని, ఘన ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ వంటి వారు ప్రధాన పాత్రల్లో సునయని.బి, సాకేత్.జి నిర్మాతలుగా వ్యవహరించారు. తరుణ్ మహాదేవ్ తెరకేక్కించిన సమ్మేళనం సిరీస్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కొత్త మొహాలతో ఇలాంటి సున్నితమైన అంశాలను జోడించి డైరెక్టర్ తరుణ్ మహదేవ్ సిరీస్ ను అద్భుతంగా మలిచాడు. ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్ కానీ, అడల్ట్ కామెడీని కానీ జపించలేదు.

ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సిరీస్ ను అద్భుతంగా తెరకెక్కించారు. మూడో ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ పరుగులు పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ క్లీన్ సిరీస్ కు శ్రావణ్ జీ కుమార్ విజువల్స్, శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు. ముఖ్యంగా శరవణ వాసుదేవన్ బిజిఎం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

తెలుగు వెబ్ సిరీస్ ల ప్రపంచంలో రోజుకో కొత్త ప్రయోగం చూస్తూనే వున్నాం. అందులో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో వినూత్నమైన ప్రయత్నం సమ్మేళనం, ఇది ఫిబ్రవరి 20 నుంచి ETV Win లో ప్రసారం అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కు సారథ్యం వహించిన వ్యక్తి – తరుణ్ మహాదేవ్!ఈ వెబ్ సిరీస్ వెనుక ఉన్న నూతన దర్శకుడు తరుణ్ మహాదేవ్, తన తొలిప్రయత్నంలోనే వినూత్న కథను అందించేందుకు ప్రయత్నించాడు. మొదటి రెండు ఎపిసోడ్లు మొఖ పరిచయాలతో, సరాదాగా సాగిపోయే కధనంతో, కనువిందు పాత్రలతో, నడిపించాడు . కానీ ముఖ పరిచయాలకి కాస్త ఎక్కువే సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కళ్ళు కొత్తవారే అవటం విశేషం. తారాగణం కొత్తదైనటప్పటికి ధర్శకుడు వినియోగించుకున్న తీరు ప్రశంసనీయం.

మూడవ ఎపిసోడ్ నుంచి దర్శకుడు తరుణ్ పూర్తిగా ఎమోషనల్ డ్రామా వైపు మలుపు తిప్పారు. ఇది ఆడియెన్స్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేలా రూపొందించబడింది. ఇక్కడ నుంచి చూసే ప్రతి ఒక్కళ్ళు ఈ వెబ్ సిరీస్ ని ఎంతగానో ఇష్టపడతారు. ఒక నూతన దర్శకుడు ఇలాంటి ప్రయోగం చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. పైగా, మద్దతు లేకుండా కొత్తగా ప్రయత్నించడం అంటే అతని సాహసాన్ని చూపిస్తుంది. ఇది కేవలం కథానాయకుల నటనకే కాకుండా, కథలోని ప్రతి పాత్రను బలంగా నిలబెట్టే విధంగా రూపొందించబడింది.

సమ్మేళనం వెబ్ సిరీస్‌లో DOP గా పనిచేసిన శ్రవణ్ జి కుమార్, తన కెమెరా మాంత్రికతతో ఈ వెబ్ సిరీస్‌కు ప్రత్యేకమైన ఆకర్షణ తీసుకొచ్చాడు. ప్రతీ ఫ్రేమ్ కళాత్మకంగా ఉండేలా ప్లాన్ చేసి, స్టోరీtellingను మరింత బలంగా తీర్చిదిద్దాడు. విజువల్స్ గ్రాండ్‌గా ఉండేలా హ్యాండిల్ చేయడం అతని ప్రధాన విశేషం.కెమెరా తోనే కాదు, కంప్యూటరు తో కూడా అతని పనితనం ప్రేక్షకులకి నచ్చుతుంది. తన ఎడిటింగ్ స్కిల్స్ తో సిరీస్ స్థాయి ని అమాంతం పెంచేశాడు. సిరీస్ కట్ అనేది ప్రేక్షకుడిని స్టోరీకి మరింత దగ్గరగా తీసుకెళ్లే అద్భుత కళ. ఈ పని శ్రవణ్ జి కుమార్ అత్యుత్తమంగా నిర్వహించాడు. అతని స్మార్ట్ ఎడిటింగ్ స్కిల్స్ ఈ వెబ్ సిరీస్‌ను మరింత ఇంటెన్స్‌గా, ఆసక్తికరంగా మార్చేశాయి. విజువల్ ఫ్లో ఎక్కడా బ్రేక్ కాకుండా, ప్రతి సీన్ ఇంపాక్ట్ కలిగేలా ఉండేలా అతను ప్లాన్ చేశాడు. సమ్మేళనం వెబ్ సిరీస్ విజయానికి శ్రవణ్ జి కుమార్ ఒక పెద్ద ప్లస్ పాయింట్. కెమెరా హాండ్లింగ్ మరియు ఎడిటింగ్‌తో ఈ వెబ్ సిరీస్ స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ రెండిటిలోనూ తన ప్రతిభను చాటుకున్న శ్రవణ్ జి కుమార్, ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్ అసెట్‌గా నిలిచాడు.

BGM – సీన్స్‌కు కొత్త జన్మ:

సినిమా లేదా వెబ్ సిరీస్ లో ఓ మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటే, ప్రేక్షకుడిని కథలో మరింతగా మమేకం చేయగలదు. సమ్మేళనం లో సరవణ వాసుదేవ్ ఇచ్చిన BGM కొన్ని సీన్స్‌కి పునర్జన్మ ఇచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన మ్యూజిక్, కథను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. ఒక్కో సీన్‌లో మూడ్ క్రియేట్ చేయడంలో ఆయన కష్టం స్పష్టంగా కనిపిస్తాయి.

సారాంశం:

స్నేహం అంటే ఏమిటి? నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలి? ఒక స్నేహితుడి కోసం మరొకరు ఎంతవరకు వెళ్లగలరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే వెబ్ సిరీస్ సమ్మేళనం.ఈ సిరీస్‌లో నాలుగు నిజమైన స్నేహితులు తమ తీయని జ్ఞాపకాలను, భావోద్వేగాలను పంచుకుంటారు. ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేయడమే కాదు, అవసరమైన సమయంలో అండగా నిలుస్తారు. ఈ కథలోని స్నేహ బంధం ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది.దర్శకుడు తన మొదటి ప్రయత్నంలోనే అద్భుతమైన కంటెంట్ అందించాడు. ఆయన తీసుకున్న కేర్ కారణంగా సమ్మేళనం నాచురల్‌గా, నిజమైన అనుభూతిని కలిగించేలా ఉంది. కెమెరా వర్క్, సంగీతం కూడా మంచి స్థాయిలో ఉండటంతో, ఓ మంచి అనుభూతిని అందిస్తుంది. “సమ్మేళనం” – ఇది ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన వెబ్ సిరీస్. స్నేహానికి అర్థం తెలియాలి అంటే, ఈ సిరీస్ చూడాల్సిందే!

ప్లస్‌ పాయింట్స్‌
దర్శకత్వం
కథ,
విజువల్స్‌,
సంగీతం

రివ్యూ 3/5 వేయండి

Read more RELATED
Recommended to you

Latest news