అమ్మాయితో జీహెచ్‌ఎంసీ అధికారి అక్రమ సంబంధం…రెడ్‌ హ్యాండెడ్‌ భార్యకు దొరకడంతో..!

-

జిహెచ్ఎంసిలో అడ్మిన్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ అండంగా దొరికిపోయాడు. జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ ను వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య కళ్యాణి. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే ఉంటుండగా భార్య కళ్యాణి పట్టుకొని ఇద్దరినీ చితకబాదింది.

గత కొద్ది రోజులుగా వారాసిగూడ లో ఆ అమ్మాయితో ఉంటున్నాడట జానకిరామ్. అయితే…. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళుతున్నాడని నిగాపెట్టింది కళ్యాణి. ఈ తరుణంలోనే… సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్ట్మెంట్లో ఉన్న ఇరద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య కళ్యాణి. జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని ఆరోపణలు చేస్తున్నారు భార్య కళ్యాణి.. గొడవ జరుగుతున్న ఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news