సందీప్ కిషన్ మైఖేల్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ ఎన్నో సంవత్సరాల నుండి సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన ఖాతాలో ఒక కమర్షియల్ హిట్ కూడా లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా కథాబలం ఉన్న సినిమాలు చేస్తున్నా.. రిలీజ్ టైం బాగోలేకో.. ఔట్ పుట్ సరిగా లేకపోవడమో తెలియదు కానీ పలు కారణాలతో ఆయన సినిమాలు ఆవరేజ్ గానే మిగిలిపోతున్నాయి. ఇకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న యంగ్ హీరోలతో పోల్చుకుంటే సందీప్ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే ఆయన ఫలితం ఎలా ఉన్నా సరే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఈ క్రమంలోనే సెట్స్ పై నాలుగు సినిమాలను ఉంచిన సందీప్ కిషన్ ఇప్పుడు మైఖేల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రంజిత్ జయ కోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకోగా ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పోస్టర్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.ఇకపోతే ఫిబ్రవరి 3వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో జనవరి 26వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేకాదు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. మొత్తానికైతే సందీప్ కిషన్ ఈ పాన్ ఇండియా సినిమాతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version