కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ అలాగే మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో…. భారీ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి రౌండ్ ఉత్కంఠ భరితంగా మారుతుంది. పదో రౌండ్ ముగిసే సమయానికి అంజిరెడ్డి లీడింగ్ లో ఉన్నారు. పదవ రౌండ్ సమయానికి 4562 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు అంజిరెడ్డి. ఇక ఐదు రౌండ్ల వరకు దూసుకు వెళ్లిన అంజిరెడ్డి ఆరో రౌండులో రెండవ స్థానానికి పడిపోయారు. 7, 8,9 రౌండ్లలో మూడవ స్థానంలో అంజిరెడ్డి కొనసాగి ఇప్పుడు మళ్లీ… పదో రౌండ్లో మొదటి స్థానానికి వచ్చారు.
ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ అయితేనే గెలుపు ఎవరు అనేది క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు.
- హోరాహోరీగా కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
- 10వ రౌండ్ ముగిసేసరికి ఫలితాలు
- బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి – 70740
- కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి – 66178
- బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ – 56946
- మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000
- ఇప్పటి వరకు సుమారు లెక్కించిన ఓట్లు 2,10,000