మే 7న ” సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ ఈవెంట్..

-

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన సర్కారు వారి పాట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారైంది. తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. కీర్తి సురేష్ నాయికగా నటించిన ఈ చిత్రాన్ని నవీన్ యోర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సర్కారు వారి పాట రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 7న ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు పోస్టర్ ద్వారా గురువారం నిర్మాతలు తెలియజేశారు.

యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ లో మహేష్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఫుల్ హాండ్స్ టీ షర్ట్, జీన్స్ తో సాంగ్ పాడుతున్నట్లు పోటీ చేశాడు మహేష్. ఫుల్ మాస్ యాక్షన్ తో పాటు, ఆడియన్స్ కు మంచి వినోదాన్ని ఇచ్చే కామెడీ సీన్లు కూడా చాలానే ఉన్నాయని ట్రైలర్ తెలియజేసింది. సముద్రఖని విలన్ గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరో రెండు కీలక పాత్రలు పోషించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ మది సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఎస్సెట్స్ గా నిలిచే ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బీ ఎంటర్టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version