షారుక్ ఖాన్ కు సెన్సార్ బోర్డు బిగ్ షాక్..!!

-

షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ మూవీ . ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసిన దగ్గరి నుంచే ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. హాట్ సాంగ్ లో షారుక్ మరియు దీపిక రొమాన్స్ వల్లే ఈ గోల మొదలైంది. మరీ ముఖ్యంగా పెళ్లైన యువతి మరీ ఇంతలా రెచ్చిపోయి టూ పీస్ బికినీలో అంగాంగ ప్రదర్శన చేయడంపై గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో మరీ ఇంత పచ్చిగా ఎవరూ నటించలేదని ఒక స్టార్ హీరోయిన్ అయి వుండి  పెళ్లైనా కూడా ఇలా రెచ్చిపోవడం ఏమీ బాగాలేదని దీపికపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీపికా పదుకొనె కాషాయ రంగు బికినీ ఫొటో వైరల్ గా మారింది. దీనితో అక్కడ నుంచి నార్త్ లో ఆడియెన్స్ మరియు అధికార పార్టీ బీజేపీ వారు ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చెయ్యాలని పిలుపునిచ్చారు. దీనితో ఇది ఈరోజుకి కూడా ట్రెండ్ అవుతూ పెరుగుతూ పోయింది..

తాజాగా పఠాన్ కు సెన్సార్ బోర్డు కూడా షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.దీపిక బికినీ సహా పాటలో ఆమె  హాట్ నెస్ వేడిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని సీన్లు తీసివేయాలనిన్ కచ్చితంగా సెన్సార్ నిబంధలను పాటించి తీరాలని ఆదేశాలిచ్చింది. దీనితో షారుక్ ఖాన్ మూవీ టీమ్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది అని అంటున్నారు. దీనితో వారు మార్పులు చేస్తారా లేక అప్పీల్ కు వెళతారా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మరికొంత మంది ఇంతకంటే దారుణమైన పాటలు, సీన్లు ఉన్న సినిమాలు ను ఏమి చేశారు అంటూ ప్రశ్నలు లేవనెత్తు తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version