సెప్టెంబ‌ర్‌లో టాలీవుడ్‌లో క్రేజీ రిలీజ్‌లు..

-

సుజిత్- యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ `సాహో` చిత్రం శుక్ర‌వారం విడుద‌ల అయింది. వాస్త‌వానికి సాహో ఆగ‌స్టు 15 నుంచి ఆగ‌స్టు 30కి వాయిదా ప‌డి చాలా సినిమాలను ఇబ్బంది పెట్టింది. దీంతో మిగిలిన సినిమాల విడుద‌ల డేట్లు అన్నీ తారుమారు అయిపోయాయి.  ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో సాహో త‌ర్వాత సెప్టెంబ‌ర్‌లో డ‌జ‌న్‌కు పైగా సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. ఈ చిత్రాల్లో ఇద్ద‌రు క్రేజీ స్టార్ సినిమాల‌తో పాటు అప్ క‌మింగ్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.

ఇక సాహో రిలీజ్ అయిన నెక్ట్స్ వీక్ నుంచి మిగిలిన సినిమాల హ‌డావుడి మొద‌ల‌వ‌బోతుంది. ఈ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ 6న  ఆది, కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `జోడీ` రిలీజ్ కాబోతుంది. యూత్‌ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. దీంతో పాటు ధృవ్‌ కరుణాకర్‌, శివంగి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న సినిమా ‘అశ్వమేథం’. జి. నితిన్‌ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం స్పై థ్రిల్లర్‌గా ఇదే రోజు విడుద‌ల కానుంది.

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేస్తు న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో డా.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం `ఉండిపోరాదే` కూడా సెప్టెండ‌ర్ 6న రిలీజ్ అవుతుంది.అలాగే వీటితో పాటు అదే రోజు వీడు సరైనోడు, మార్షల్, ద‌ర్ప‌ణం చిత్రాలు కూడా రిలీజ్ అవ్వ‌నున్నాయి. ఇక సెప్టెంబ‌ర్ 12న సందెట్లో సడేమియాలా సుదీప్ నటించిన `పహిల్వాన్` విడుద‌ల అవుతోంది.

ఇలాంటి చిన్న చిన్న సినిమాలు ఎన్ని ఉన్నా అస‌లు ఫ‌టింగ్ మాత్రం క్రేజీ స్టార్ హీరోలైన `నాని గ్యాంగ్ లీడ‌ర్‌` మ‌రియు వ‌రుణ్ తేజ్ `వాల్మీకి` సినిమాల మ‌ధ్యే ఉండ‌బోతుంది. ఇక `గ్యాంగ్ లీడ‌ర్‌` సెప్టెండ‌ర్ 13న విడుద‌ల అవుతుంటే `వాల్మీకి` సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల కానుంది. వారం రోజుల గ్యాప్ ఉన్న ఈ రెండు సినిమాల జోన‌ర్ వేరు. అయితే సెప్టెండ‌ర్ 20 `వాల్మీకి`తో పాటు తమిళ స్టార్ హీరోBandobast

మ‌రి ఈ క్రేజీ హీరోల సినిమాల్లో ఎవ‌రు బాక్సాఫీస్ వ‌ద్ద‌ పైచేయి సాధిస్తారో ? చూడాల్సి ఉంది. ఇక‌ సెప్టెంబ‌ర్ మొత్తం ఫుల్‌గా సినిమాల‌తో బుక్ అయినా పెద్ద‌గా చెప్పుకోదగ్గ సినిమాలు రెండు మూడు మాత్రమే ఉన్నాయి. మ‌రి ఈ సెప్టెంబ‌ర్ క్రేజీ రిలీజ్‌ల రిజ‌ల్ట్‌ ఎలా ఉంటుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version