రాజకీయాల్లో ఎత్తులు.. పైఎత్తులు కామన్.. ఈవిషయంలో ఒకింత ఆలస్యంగా మేల్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోతోంది. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు నైరా శ్యంలో మునిగిపోతున్నారు. ప్రజల వద్దకే పాలన అనే మాటలను జగన్ చేతల్లో చేసి చూపిస్తుండడం, ఎక్క డా వివాదాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలు చేరువ అవుతుండడం వంటి కారణాలతో అధికార పార్టీకి ఊపు పెరుగుతోంది. మరోపక్క, ఇంకా ఓటమి నుంచి తెలుగు దేశం పార్టీ శ్రేణులు, నాయకులు ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఎక్కడికక్కడ నాయకులు జంప్ చేసేందుకు రెడీ అయ్యారు.
ఇప్పటికే కాపుల్లో ప్రధానంగా చీలిక వచ్చింది. బాబు తమకు ఏమీ చేయలేదని, తన రాజకీయ స్వార్థానికి తాము బలైపోయామని పేర్కొంటూ.. కొందరు నాయకులు ఇప్పటికే టీడీపీకి రాం రాం పలికారు. ఇదిలా వుంటే, చాలా చోట్ల పార్టీ నాయకులు ఇంకా కాలు బయటకు పెట్టడం లేదు. ఏం చేస్తే.. ఏమవుతుందో అనే ధోర ణిలో వారు మథన పడుతున్నారు. బాబు పాలనలో వారు చేసిన పనులే ఇప్పుడు వారి నెత్తిపై కేసుల రూపం లో వేలాడుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీని పట్టించుకునే నాథుడు కరువయ్యారు. దీంతో చంద్ర బాబు పార్టీని బతికించుకోవడం కోసం, పార్టీలో నేతలు జారి పోకుండా చూసుకోవడం కోసం పెద్ద ఎత్తుగడ వేశారు. దీనిలో భాగంగా.. జగన్ ప్రభుత్వంపై నిరసనలకు రెడీ అయ్యారు చంద్రబాబు. మొన్నామధ్య అన్నాక్యాం టీన్ల మూత విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా దండెత్తారు. అదేసమయంలో ఇప్పుడు ఇసుకపై పోరాటం అం టూ మరోసారి దండెత్తారు. అయితే, ఈ రెండు కార్యక్రమాల ద్వారా జగన్‌కు ఏమైనా జరుగుతుందని, ఆయన ప్రభుత్వంపై మచ్చలు పడాలని చంద్రబాబు కోరుకుంటున్నారు.
అయితే, దీనికి భిన్నంగా టీడీపీలో ఉన్న అసంతృప్తులు, అసహనాలు, ధిక్కారాలు వంటివి తెరమీదికి వస్తున్నాయి. అన్నా క్యాంటీన్ల నిసరసనకు అనంతపురంలో ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రాలేదు. ఒక్క కాల్వ వచ్చారు. ఇక, కృష్ణాలోనూ కీలక నాయకులు ఇంటికే పరిమితమయ్యారు. ఇలా ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి బాబు లేనిపోనివిషయాలపై చేస్తున్న ఆందోళన ఆయన పీకలకే చుట్టుకుంటోంది.