ఆ మూవీ కోసమే జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది – కృతి శెట్టి..!

-

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఓవర్ నైట్ లోని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి తాజాగా నటిస్తున్న చిత్రం కస్టడీ.. అక్కినేని నాగచైతన్య లీడింగ్ ఫిలిం మేకర్ వెంకట్ ప్రభు తెలుగు – తమిళ్ ద్విభాష ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఇక ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై భారీ నిర్మాణ విలువలు , సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్ విడుదల అవ్వగా ఊహించని విధంగా రెస్పాన్స్ లభించింది.

ఇక మే 12వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కృతి శెట్టి ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాల గురించి విలేకరుల సమావేశంలో పంచుకుంది. ఇందులో భాగంగానే కస్టడీలో మీ పాత్రలో నచ్చిందేమిటి అని ఆమెను విలేకరులు ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ.. కస్టడీ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. కథ సీరియస్ అవుతున్నప్పుడు నా పాత్ర దానిని బ్యాలెన్స్ చేస్తుంది. సాధారణంగా సినిమాలకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం.. కానీ కస్టడీ సినిమా కోసం నేను జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను.

ఇది యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ..ఈ సినిమా తర్వాత మార్వెల్స్ స్టూడియో నుంచి నాకు కాల్ వస్తుందని వెంకట్ ప్రభు గారితో చెప్పాను.. నా పాత్రలో అంత మంచి ఎమోషన్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక నాగచైతన్యతో వర్క్ ఎలా అనిపించింది అని అడగ్గా .. నాగచైతన్య నా ఫేవరెట్ హీరో మాత్రమే కాదు వ్యక్తి కూడా.. చాలా నిజాయితీగా ఉంటారు. ఈ కథలో పాత్రలు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి.నేను ఆఫ్ స్క్రీన్ లో చైతన్యతో ఫ్రీగా ఉంటేనే కదా ఆన్లైన్ కెమిస్ట్రీ బాగా పండేది. ఆయనతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version