శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ తెలుగు వర్షన్ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

-

కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ హీరోగా ఎం.జీ. శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ఘోస్ట్. అక్టోబర్ 19న కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఘోస్ట్ తెలుగు వర్షన్ ని వాస్తవానికి అక్టోబర్ 27న విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ మూవీ తాజాగా న్యూ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

తమ మూవీ తెలుగు వర్షన్ ని నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. వచ్చే వారంలో తెలుగులో కీడా కోలా, పొలిమేర 2 మూవీస్ రిలీజ్ కానున్నాయి. మరి వాటితో పాటు తెలుగు ఆడియన్స్ ముందుకి రానున్న ఘోస్ట్ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. జయరామ్, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జోయిస్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందేశ్ గ్రాండ్ గా నిర్మించారు. కాగా ఈ మూవీకి అర్జున్ జన్య స్వరాలు సమకూర్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version